Loading...
Maruti Suzuki: రూ.6.10 లక్షలకే మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌.. ADASతో అదిరిపోయే సేఫ్టీ!
రూ.6.10 లక్షలకే మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌.. ADASతో అదిరిపోయే సేఫ్టీ!

Maruti Suzuki: రూ.6.10 లక్షలకే మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌.. ADASతో అదిరిపోయే సేఫ్టీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2026 బాలెనో ప్రారంభ ధరను రూ.6.10 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) నిర్ణయించింది. కొత్త మోడల్‌లో డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌ పరంగా గణనీయమైన అప్‌డేట్స్‌ చేసింది.

వివరాలు

డిజైన్‌లో స్వల్ప మార్పులు

కొత్త బాలెనో మొత్తం సిల్హౌట్‌ ప్రస్తుత మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే ముందు భాగంలో ప్రొజెక్టర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, వాటిలోని డీఆర్‌ఎల్‌ డిజైన్‌ను స్వల్పంగా మార్చారు.

కొత్త డిజైన్‌ గ్రిల్‌, రీడిజైన్‌ చేసిన బంపర్‌ను కూడా అందించారు. వెనుక భాగం కూడా ప్రస్తుత బాలెనోను పోలి ఉంటుంది.

అయితే కొత్తగా షార్క్‌ ఫిన్‌ యాంటెన్నాను తీసుకొచ్చారు. కారు సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త 16-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వివరాలు

డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్

2026 బాలెనో ఇంటీరియర్‌లో బ్లూ, బ్లాక్‌ రంగులతో కూడిన డ్యూయల్‌ టోన్‌ థీమ్‌ను అందించారు. డ్యాష్‌బోర్డ్‌ లేఅవుట్‌ దాదాపుగా పాత మోడల్‌ మాదిరిగానే ఉంటుంది.

మధ్యలో ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉండగా.. ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్‌ బటన్లను కొనసాగించారు.

స్టీరింగ్‌ వీల్‌ డిజైన్‌లోనూ పెద్దగా మార్పులు చేయలేదు. మౌంటెడ్‌ కంట్రోల్స్‌తో అదే తరహా స్టీరింగ్‌ను అందించారు.

ADVERTISEMENT

వివరాలు

ఫీచర్లకు పెద్దపీట

కొత్త బాలెనోలో సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ సీట్లను అందిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.

దీంతో పాటు వైర్‌లెస్‌ ఛార్జర్‌, క్లారియన్‌ సౌండ్‌ సిస్టమ్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (TPMS), హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ADASతో మరింత భద్రత

సేఫ్టీ విషయంలోనూ కొత్త బాలెనోలో కీలకమైన మార్పులు చేశారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్‌గా అందించారు.

అంతేకాకుండా లెవల్‌-2 ADAS ఫీచర్లను కూడా తీసుకొచ్చారు.

అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, లేన్‌ డిపార్చర్‌ ప్రివెన్షన్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, హై బీమ్‌ అసిస్ట్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

కొత్త ఇంజిన్‌.. CNG ఆప్షన్‌ కూడా

2026 బాలెనోలో 1.2 లీటర్‌ జెడ్‌-సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇదే ఇంజిన్‌ను గతంలో స్విఫ్ట్‌, డిజైర్‌ మోడళ్లలో కూడా మారుతి సుజుకి అందించింది.

ఈ ఇంజిన్‌తో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ CNG వేరియంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

CNG వెర్షన్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కొత్త ఫీచర్లు, అధునాతన సేఫ్టీ టెక్నాలజీ, అప్‌డేటెడ్‌ పవర్‌ట్రెయిన్‌తో వచ్చిన 2026 మారుతి సుజుకి బాలెనో.. భారత మార్కెట్లో హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ వంటి కార్లకు పోటీగా కొనసాగనుంది.

ADVERTISEMENT