Maruti Suzuki: మారుతీ సుజుకీ దూకుడు.. ఆగస్టులో 1.77 లక్షల కార్ల విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ సుజుకీకి ఆగస్టు నెలలో మంచి ఫలితాలు వచ్చాయి. దేశీయ ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్‌లు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 35 శాతం పెరిగాయి. కంపెనీ మొత్తం 1,76,971 యూనిట్లను డీలర్లకు పంపింది. 2025 ఆగస్టులో ఈ సంఖ్య 1,31,278 యూనిట్లుగా ఉంది. అయితే జూలై 2026లో పంపిన 1,96,203 యూనిట్లతో పోలిస్తే ఆగస్టులో డిస్పాచ్‌లు 10 శాతం తగ్గాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి కంపెనీ నుంచి డీలర్లకు పంపిన వాహనాల సంఖ్య మాత్రమే. రిటైల్ రిజిస్ట్రేషన్లను ఇవి సూచించవు. మోడల్ వారీగా చూస్తే మారుతీ సుజుకీ వాగన్‌ఆర్ ఆగస్టులో అత్యధికంగా డిస్పాచ్ అయిన కారుగా నిలిచింది. మొత్తం 20,180 వాగన్‌ఆర్ యూనిట్లను డీలర్లకు పంపారు.
వివరాలు
మారుతీ కార్లలో టాప్ మోడళ్లివే.. స్విఫ్ట్, ఫ్రాంక్స్ జోరు
అయితే గతేడాది ఆగస్టులోని 23,338 యూనిట్లతో పోలిస్తే ఈసారి 14శాతం తగ్గాయి. జూలైతో పోల్చినా వాగన్‌ఆర్ డిస్పాచ్‌లు 14శాతం తగ్గడం గమనార్హం.
వాగన్‌ఆర్ తర్వాత స్విఫ్ట్ రెండో స్థానంలో నిలిచింది.ఆగస్టులో 19,832 స్విఫ్ట్ కార్లను డీలర్లకు పంపారు.
గతేడాది ఆగస్టులో 12,385 యూనిట్లు మాత్రమే డిస్పాచ్ కాగా.. ఈసారి 60శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
అయితే జూలైతో పోలిస్తే స్విఫ్ట్ డిస్పాచ్‌లు 8శాతం తగ్గాయి.
ఫ్రాంక్స్ 18,730 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది.గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఫ్రాంక్స్ డిస్పాచ్‌లు 51శాతం పెరిగాయి.
అయితే జూలైతో పోల్చితే 4శాతం తగ్గాయి.
ఎర్టిగా 18,516యూనిట్లతో తర్వాతి స్థానంలో ఉంది. 2025 ఆగస్టులో 18,445యూనిట్లుగా ఉన్న డిస్పాచ్‌లు ఈసారి స్వల్పంగా పెరిగాయి.
నెలవారీగా మాత్రం 14శాతం తగ్గాయి.
వివరాలు
బ్రెజ్జా డిస్పాచ్‌లు 27% పెరుగుదల.. విక్టోరిస్‌కు 15% వృద్ధి
డిజైర్ 18,418 యూనిట్లతో మరో కీలక మోడల్‌గా నిలిచింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే డిజైర్ డిస్పాచ్‌లు 12శాతం పెరిగాయి.
అయితే జూలైతో పోలిస్తే ఏకంగా 23శాతం తగ్గాయి. వాగన్‌ఆర్,స్విఫ్ట్,ఫ్రాంక్స్,ఎర్టిగా,డిజైర్.. ఈ ఐదు మోడళ్లను కలిపితే ఆగస్టులో మారుతీ మొత్తం డిస్పాచ్‌లలో సుమారు 54శాతం వాటా ఉంది.
ఈ ఐదు కార్ల కలిపి డిస్పాచ్‌లు 95,676 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇక బ్రెజ్జా నెలవారీ పనితీరులో మంచి వృద్ధిని చూపించింది.
జూలైలో 12,034యూనిట్లుగా ఉన్న డిస్పాచ్‌లు ఆగస్టులో 27శాతం పెరిగి 15,288యూనిట్లకు చేరాయి.
గతేడాది ఆగస్టుతో పోలిస్తే కూడా బ్రెజ్జా డిస్పాచ్‌లు 12శాతం పెరిగాయి.
మరోవైపు విక్టోరిస్ డిస్పాచ్‌లు జూలైలోని 11,334యూనిట్ల నుంచి ఆగస్టులో 15శాతం పెరిగి 12,978 యూనిట్లకు చేరాయి.
వివరాలు
సెలెరియో సేల్స్‌లో భారీ జంప్.. ఏడాదిలో 99 శాతం వృద్ధి
అయితే 2025 ఆగస్టుకు సంబంధించిన విక్టోరిస్ డిస్పాచ్ డేటా అందుబాటులో లేకపోవడంతో వార్షిక వృద్ధిని లెక్కించడం సాధ్యం కాలేదు.
బలెనో ఆగస్టులో 15,746 యూనిట్లను నమోదు చేసింది.
గతేడాదితో పోలిస్తే ఇది 25 శాతం వృద్ధి కాగా.. జూలైతో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఈకో డిస్పాచ్‌లు 11,961 యూనిట్లుగా ఉన్నాయి.
గతేడాదితో పోలిస్తే 11 శాతం పెరిగినప్పటికీ.. నెలవారీగా 14 శాతం తగ్గాయి. సెలెరియో మాత్రం వార్షిక వృద్ధిలో దూసుకెళ్లింది.
ఆగస్టులో 2,990 యూనిట్లు డిస్పాచ్ అయ్యాయి. 2025 ఆగస్టులో 1,505 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఈసారి దాదాపు రెట్టింపయ్యాయి.
దీంతో 99 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. అయితే జూలైతో పోలిస్తే సెలెరియో డిస్పాచ్‌లు 24 శాతం తగ్గాయి.
వివరాలు
ఆల్టో సేల్స్ దూకుడు.. గ్రాండ్ విటారా 36% వృద్ధి.. ఈవిటారా తగ్గుదల
ఆల్టో డిస్పాచ్‌లు 8,692 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 57 శాతం పెరిగాయి.
అయితే జూలైతో పోల్చితే 31 శాతం తగ్గాయి. గ్రాండ్ విటారా 7,808 యూనిట్ల డిస్పాచ్‌తో 36 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
నెలవారీగా మాత్రం 4 శాతం తగ్గింది. ఎలక్ట్రిక్ మోడల్ ఈవిటారా డిస్పాచ్‌లు ఆగస్టులో 1,586 యూనిట్లుగా ఉన్నాయి.
జూలైతో పోలిస్తే 5 శాతం తగ్గాయి. జిమ్నీ డిస్పాచ్‌లు మాత్రం నెలవారీగా 11 శాతం పెరిగి 586 యూనిట్లకు చేరాయి.
అయితే గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3 శాతం తగ్గాయి.
వివరాలు
ఆగస్టులో మారుతీ డిస్పాచ్‌లు 35% అప్.. నెలవారీగా 10% డౌన్
మొత్తంగా చూస్తే.. మారుతీ సుజుకీ దేశీయ ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్‌లు ఆగస్టులో వార్షికంగా 35 శాతం పెరిగాయి.
అదే సమయంలో జూలైతో పోలిస్తే 10 శాతం తగ్గాయి.
అయితే డీలర్లకు పంపే వాహనాల సంఖ్య నెలనెలా మారడం మాత్రమే రిటైల్ డిమాండ్ పెరిగిందా, తగ్గిందా అనే విషయాన్ని పూర్తిగా చెప్పదు.
డీలర్ల వద్ద ఉన్న స్టాక్ స్థాయుల్లో మార్పులు కూడా డిస్పాచ్‌లపై ప్రభావం చూపుతాయి.