Maruti Suzuki :మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రేపే లాంచ్.. కొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ కార్ల మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ రేపు అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ డీలర్‌షిప్‌లకు చేరుకోగా,బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో డీలర్‌షిప్‌ల నుంచి వచ్చిన ఫొటోలు,వీడియోలతో కొత్త బ్రెజ్జా రూపురేఖలు దాదాపు స్పష్టమయ్యాయి. ఈసారి బ్రెజ్జా కొత్త డిజైన్‌తో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కొత్త బ్రెజ్జా బాహ్య రూపంలో పెద్దగా మార్పులు చేయకపోయినా,ముందు భాగంలో మాత్రం కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్‌ను అందించారు. అలాగే హెడ్‌ల్యాంప్‌లు,డీఆర్‌ఎల్‌ల(డే టైమ్ రన్నింగ్ లైట్స్)డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. పక్క భాగంలో కొత్త అలాయ్ వీల్స్ కనిపించే అవకాశం ఉంది.
వివరాలు
కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు కూడా వచ్చే అవకాశం
వెనుక భాగంలో బంపర్, టెయిల్ ల్యాంప్‌ల అంతర్గత డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు కూడా వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
క్యాబిన్‌లో మాత్రం గణనీయమైన మార్పులు చేశారు. సెంటర్ కన్సోల్‌ను కొత్తగా డిజైన్ చేయడంతో పాటు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే అనేక ఫీచర్లను చేర్చనున్నట్లు సమాచారం.
ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, సన్‌గ్లాస్ హోల్డర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్‌తో కూడిన కొత్త సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రీచ్-రేక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ చార్జర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
బిల్ట్-ఇన్ యాప్‌లు, అలెక్సా సపోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు
కొత్త బ్రెజ్జాలో ప్రధాన ఆకర్షణగా 10.1అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది.
ఇందులో బిల్ట్-ఇన్ యాప్‌లు, అలెక్సా సపోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి.
అలాగే ముందు సీట్లకు వెంటిలేషన్ ఫీచర్‌ను కూడా అందించవచ్చని సమాచారం.
ముఖ్యంగా వేసవి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే ఫీచర్‌గా భావిస్తున్నారు.
ఇంజిన్ విషయానికి వస్తే,కొత్త బ్రెజ్జా మూడు పవర్‌ట్రైన్ ఎంపికల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్‌పీ శక్తి, 139 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
వాహనం అడుగు భాగంలో సీఎన్‌జీ ట్యాంక్
మరోవైపు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 110 హెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను అందించే అవకాశం ఉంది. అదనంగా సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్లోకి రానుంది.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభించే అవకాశం ఉంది.
సీఎన్‌జీ వేరియంట్ మాత్రం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా సీఎన్‌జీ ట్యాంక్‌ను వాహనం అడుగు భాగంలో అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయం
దీంతో బూట్ స్పేస్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ఇప్పటికే రూ.11,000 టోకెన్ మొత్తంతో ప్రారంభమయ్యాయి.
ఈ ఎస్‌యూవీ దేశవ్యాప్తంగా మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనున్నారు.
మార్కెట్లో ఇది టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, హ్యుందాయ్ వెన్యూ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.