Page Loader
Maruti Suzuki E-Vitara:ఫ్యామిలీ ప్రయాణాల కోసం లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు- మారుతీ సుజుకీ ఈ-విటారా విడుదల ​ డేట్​ ఇదే?
మారుతీ సుజుకీ ఈ-విటారా విడుదల ​ డేట్​ ఇదే?

Maruti Suzuki E-Vitara:ఫ్యామిలీ ప్రయాణాల కోసం లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు- మారుతీ సుజుకీ ఈ-విటారా విడుదల ​ డేట్​ ఇదే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఆటో మొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు కోసం భారతీయ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మారుతీ సుజుకీ ఈ-విటారా మోడల్‌పై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 3న ఈ కారును మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

మారుతీ సుజుకీ ఈ-విటారా ఎలక్ట్రిక్ కారుపై భారీ ఆశలు 

ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ,ఇప్పటి వరకు మారుతీ సుజుకీ నుంచి ఎలాంటి ఈవీ విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో విడుదల కానున్న ఈ-విటారాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జడ్‌ఎస్ ఈవీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఉంది. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' మోడల్ ఇప్పటికే యూకే మార్కెట్లో విడుదలైంది. అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్ల ప్రకారం,ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దీని ద్వారా 426కిలోమీటర్ల (డబ్ల్యూఎల్‌టీపీ)రేంజ్ అందుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 45 నిమిషాల్లో 10-80 శాతం బ్యాటరీను ఛార్జ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.

వివరాలు 

ఈ-విటారా డిజైన్ ప్రత్యేకతలు 

మారుతీ సుజుకీ ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆధునికతను, ప్రీమియం లుక్‌ను కలగజేసుకుని ఉంటుంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వై-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్ఎల్), ముందు ఫాగ్ ల్యాంపులతో ఇది ఆకట్టుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి దీనిలో సాంప్రదాయ రేడియేటర్ గ్రిల్ అవసరం లేదు. పక్కవైపున బ్లాక్ క్లాడింగ్, 18-అంగుళాల ఏరోడైనమిక్ డిజైన్ ఉన్న అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో గ్లోసీ బ్లాక్ స్ట్రిప్ ద్వారా కలిపిన 3-పీసు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, బ్లాక్ బంపర్ ప్రత్యేకతలు.

వివరాలు 

ఈ-విటారా ఇంటీరియర్, ఫీచర్లు 

వాహనం లోపల డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ అమరికలు ఉన్నాయి. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఏసీ వెంట్స్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (ఐఆర్‌వీఎం), సెమీ-లెథరెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. అదనంగా పనోరమిక్ సన్‌రూఫ్, 10-వే అడ్‌జస్ట్‌మెంట్ ఉన్న డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లభిస్తాయి. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి ఫీచర్లు కూడా అందిస్తారు.

వివరాలు 

ఈ-విటారా రేంజ్, బ్యాటరీ డీటెయిల్స్ 

యూకే మోడల్ 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో రెండు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 344 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. ఇది 142 బీహెచ్‌పీ పవర్, 193 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో అందుబాటులో ఉంటుంది. 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని మోటార్ 171 బీహెచ్‌పీ పవర్, 193 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనితో 426 కి.మీ. వరకు రేంజ్ లభిస్తుంది. AWD వేరియంట్‌లో ఈ పవర్ మరింత పెరిగి 181 బీహెచ్‌పీ, 307 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని రేంజ్ 395 కి.మీ. వరకు ఉంటుంది.

వివరాలు 

బ్యాటరీ ఛార్జింగ్ సమయాలు 

49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 7 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ కావడానికి 6.5 గంటలు పడుతుంది. అదే 11 కేడబ్ల్యూ ఛార్జర్ ఉపయోగిస్తే ఈ సమయం 4.5 గంటలకు తగ్గుతుంది. 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను 7 కేడబ్ల్యూ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే 9 గంటలు, 11 కేడబ్ల్యూ ఛార్జర్‌తో 5.5 గంటలు పడుతుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లను డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 45 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ చేయవచ్చు.