NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్..  లాంచ్ ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్..  లాంచ్ ఎప్పుడంటే?
    మార్కెట్లోకి ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

    Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్..  లాంచ్ ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2024
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మారుతీ సుజుకీ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాకు 7-సీటర్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    ఈ 7-సీటర్ గ్రాండ్ విటారా 2025 మధ్యలో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం.

    gaadiwaadi వెబ్‌సైట్ కథనం ప్రకారం, ఈ కారును వచ్చే ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేస్తారని పేర్కొన్నారు.

    ప్రస్తుతం దీనికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఇది ఇప్పటికే ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    బూట్ గేట్,బంపర్‌లో కూడా మార్పులు

    తాజాగా స్పాటెడ్ అయిన 7-సీటర్ గ్రాండ్ విటారాలో కొత్త LED DRL, హెడ్‌ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ యూనిట్,రీడిజైన్ చేసిన బంపర్‌తో పాటు కొత్త ఎయిర్ టెక్ ఉన్నట్లు తెలుస్తోంది.

    వెనుక భాగంలో బూట్ గేట్,బంపర్‌లో కూడా మార్పులు చేశారు.

    దీనిలో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ అమర్చారు. క్యాబిన్‌లో కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఉంటుంది. ప్రస్తుత గ్రాండ్ విటారాలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులోనూ ఉపయోగించనున్నారు.

    ఇది మైల్డ్ హైబ్రీడ్ సెటప్‌తో వస్తుంది.ఈ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    అదనంగా, నాన్-హైబ్రీడ్ వెర్షన్, మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

    వివరాలు 

    ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.15 లక్షల పైమాట

    ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పెద్ద సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంస్, రెండో రో కెప్టెన్ సీట్లు వంటి ఫీచర్లను పొందుపరిచారు.

    భద్రత విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరా వ్యూ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (వీఎస్‌సీ) వంటి ఫీచర్లు ఉంటాయి.

    ఈ 7-సీటర్ గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.15 లక్షల పైమాటగా ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతీ సుజుకీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మారుతీ సుజుకీ

    Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు! వ్యాపారం
    Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..! ఆటో మొబైల్
    Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే? ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025