Loading...
Maruti Suzuki : మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల పూర్తి వివరాలివే..
మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల పూర్తి వివరాలివే..

Maruti Suzuki : మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల పూర్తి వివరాలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి సుజుకి 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి LXI, VXI, ZXI, ZXI+. పేర్లు గత మోడల్‌ల మాదిరిగానే ఉన్నప్పటికీ, ఈసారి ప్రతి వేరియంట్‌లో ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల కేవలం ధరను మాత్రమే కాకుండా, అవసరమైన సౌకర్యాలు, టెక్నాలజీ, భద్రతా ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం కొనుగోలుదారులకు సులభమవుతుంది.

వివరాలు

ధరలు, ఇంజిన్ ఎంపికలు..

కొత్త బ్రెజ్జా ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 7.40 లక్షలు. ఈ SUV మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ 109 bhp శక్తి, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 102 bhp పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది.

దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

1.5 లీటర్ S-CNG వెర్షన్ సీఎన్‌జీ మోడ్‌లో 85 bhp శక్తిని ఉత్పత్తిచేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.

వివరాలు

భద్రతలో కీలక మెరుగుదల..

ఫేస్‌లిఫ్ట్ బ్రెజ్జా అన్ని వేరియంట్లకూ BNCAP నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

దీంతో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం అయ్యాయి.

LXI బ్రెజ్జా శ్రేణిలో ఎంట్రీ లెవల్ వేరియంట్. అవసరమైన ప్రాథమిక ఫీచర్లను ఇందులో అందించారు.

ADVERTISEMENT

వివరాలు

ఈ వేరియంట్‌లో ఉండే ముఖ్యమైన ఫీచర్లు..

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)

హిల్ హోల్డ్ అసిస్ట్

అన్ని ప్రయాణికులకు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు

ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు

ముందు పవర్ విండోలు

అయితే ఈ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉండదు.

అధిక ఫీచర్ల అవసరం లేకుండా సాధారణ ఉపయోగానికి అనువైన SUV కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

ADVERTISEMENT