Adamastor Furia: పోర్చుగల్ తొలి సూపర్‌కార్ 'అడమాస్టార్ ఫ్యూరియా' గ్రాండ్ ఎంట్రీ..
ఈ వార్తాకథనం ఏంటి
పోర్చుగల్ కూడా సూపర్‌కార్ రంగంలోకి అడుగుపెట్టింది. పోర్టోకు చెందిన ఓ యువ కంపెనీ రూపొందించిన తొలి సూపర్‌కార్ 'అడమాస్టార్ ఫ్యూరియా'ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు €1.6 మిలియన్ ధరతో వచ్చిన ఈ కారు రేసింగ్ టెక్నాలజీని రోడ్లపైకి తీసుకురావడమే లక్ష్యంగా తయారైంది. పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో రూపొందించిన ఈ వాహనం హైస్పీడ్‌లో ఎక్కువ స్థిరత్వం కోసం రేస్ కార్ల మాదిరి మోనోకోక్ స్ట్రక్చర్‌తో డిజైన్ చేశారు.
వివరాలు
హ్యాండ్ బిల్ట్‌గా 60 కార్లు
పొడవు 15 అడుగులు, వెడల్పు 7.2 అడుగులు, ఎత్తు 3.3 అడుగులుగా ఉంటుంది. ఫోర్డ్ పెర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసిన 3.5 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్‌తో ఇది 650 హార్స్‌పవర్‌కు పైగా శక్తిని ఇస్తుంది. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో అందుకుంటూ గరిష్టంగా 299 కిమీ వేగంతో దూసుకెళ్తుంది. స్ట్రీట్ వెర్షన్‌తో పాటు ట్రాక్ కోసం ప్రత్యేక మోడల్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తం 60 కార్లను మాత్రమే హ్యాండ్ బిల్ట్‌గా తయారు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రముఖ రేసింగ్ పోటీల్లో పాల్గొనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.