Loading...
Hyundai: హ్యుందాయ్‌ నుంచి అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ.. జెనెసిస్ GV90 ప్రత్యేకతలివే
హ్యుందాయ్‌ నుంచి అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ.. జెనెసిస్ GV90 ప్రత్యేకతలివే

Hyundai: హ్యుందాయ్‌ నుంచి అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ.. జెనెసిస్ GV90 ప్రత్యేకతలివే

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్‌ తన కొత్త లగ్జరీ ఫ్లాగ్‌షిప్‌ వాహనం జెనెసిస్ GV90ను ఆవిష్కరించింది. పూర్తిగా ఎలక్ట్రిక్‌ పవర్‌తో నడిచే ఈ ఎస్‌యూవీలో గరిష్ఠంగా ఏడుగురు ప్రయాణించవచ్చు. ఈ కొత్త మోడల్‌తో అమెరికా మార్కెట్లో జెనెసిస్‌ లగ్జరీ వాహనాల శ్రేణి మరింత విస్తరించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ లైనప్‌లో మొత్తం ఏడు వాహనాలు ఉన్నాయి. జెనెసిస్ GV90ను దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త హ్యుందాయ్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికా మార్కెట్లో విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వివరాలు

క్యాడిలాక్‌, మెర్సిడెస్‌ వాహనాలకు పోటీ

దాదాపు పదేళ్ల క్రితం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత జెనెసిస్‌ నుంచి వస్తున్న అతిపెద్ద వాహనం GV90నే.

పెద్ద ఎస్‌యూవీల విభాగంలో ఇది క్యాడిలాక్‌ Vistiq, Escalade IQ, మెర్సిడెస్‌-బెంజ్‌ EQS SUV, రివియన్‌ R1S వంటి వాహనాలకు పోటీ ఇవ్వనుంది.

హ్యుందాయ్‌ సీఈఓ జోస్‌ మునోజ్‌ మాట్లాడుతూ.. ''జెనెసిస్‌తో పాటు లగ్జరీ మొబిలిటీ భవిష్యత్తులోనూ ఇది ఒక కీలకమైన అడుగు.

వినూత్న డిజైన్‌, అత్యుత్తమ నాణ్యతకు కట్టుబాటుతో GV90.. జెనెసిస్‌కు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది'' అని తెలిపారు.

వివరాలు

కోచ్‌ డోర్లతోనూ GV90..

జెనెసిస్ GV90ను రెండు వేరియంట్లలో అందించనున్నారు. GV90 Neolun వేరియంట్‌లో మధ్య నుంచి బయటకు తెరుచుకునే 'కోచ్‌ డోర్లు' ఉంటాయి.

ఇతర స్టాండర్డ్‌ వేరియంట్లలో సాధారణంగా తెరుచుకునే డోర్లు ఉంటాయి.

ప్రత్యేకంగా 'First Edition' మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇందులో ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో పాటు ప్రీమియం మెటీరియల్స్‌ను ఉపయోగించనున్నారు.

Neolun వేరియంట్‌లో మధ్య పిల్లర్‌ లేకపోయినప్పటికీ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జెనెసిస్‌ తెలిపింది.

అధిక భద్రతా ప్రమాణాలను అందించేలా ప్రత్యేకమైన నిర్మాణాన్ని రూపొందించినట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 499 కి.మీ.

జెనెసిస్ GV90లో కొత్త హై-పెర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు.

ఇది 660 హార్స్‌పవర్‌, 800 న్యూటన్‌ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే సుమారు 499 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని జెనెసిస్‌ అంచనా వేస్తోంది.

వాహనం డిజైన్‌లో ప్రత్యేకంగా కనిపించేలా దాని మొత్తం వెడల్పునా డ్యూయల్‌ లైట్‌ సెటప్‌ను ఇచ్చారు.

ఇవి మధ్యలో ఒక పాయింట్‌ వద్ద కలిసేలా ఉంటాయి. ఈ డిజైన్‌ను తొలిసారిగా 2024లో కాన్సెప్ట్‌ వాహనంగా జెనెసిస్‌ ప్రదర్శించింది. ఇక GV90 ఇంటీరియర్‌లోనూ అనేక లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

రిఫ్రిజిరేటర్‌, 23.6 అంగుళాల OLED డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

ఇవన్నీ GV90ను జెనెసిస్‌ బ్రాండ్‌లో అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీగా నిలబెట్టేలా ఉన్నాయి.

ADVERTISEMENT