న్యూ లుక్, సరికొత్త ఫీచర్స్‌తో ఎంజీ ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది..!
ఎంజీ మోటర్ సంస్థ త్వరలో ఫేస్ లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకురానుంది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన ఆస్టర్ ఎస్‌యూవీకి ఫెసేలిఫ్ట్ వర్షెన్ రాబోతోంది. 2021లో ఎంజీ ఆస్టర్ ను ఇండియాలోకి తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇండియాలో ఏడీఏఎస్ ఫీచర్ లభించిన తొలి వాహనంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక 2023 ఆస్టర్ ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్ ను సంస్థ ఈ మధ్యనే రిలీజ్ చేసింది. ఇది పాత వర్షెన్ ను పొలి ఉంది. ఆస్టర్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌లో భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కొత్త సాఫ్ట్వేర్ గ్రాఫిక్స్ రానున్నట్లు సంస్థ చెబుతోంది. టెక్నాలజీతో పాటు లగ్జరీ సౌకర్యం కూడా ఉండనుంది.
ఎంజీ ఆస్టర్ ఫేస్ లిఫ్ట్ ధరపై క్లారిటీ ఇవ్వని సంస్థ
ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీలో ప్రస్తుతం 10 ఇంచ్ బదులుగా 14 ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటెలిజెంట్ టర్న్ ఇండికేటర్లు, పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో కార్ లాక్/ అన్‌లాక్, 8 కలర్ యాంబియెంట్ లైటింగ్ విత్ వాయిస్ కామాండ్స్ వంటివి ఇందులో యాడ్ కానున్నాయి. భారత మార్కెట్లో ఎంజీ ఆస్టర్ ఎక్స్ షోరూం ధర రూ. 10.81లక్షలుగా ఉండగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 17లక్షలుగా ఉంది. అయితే ఈ కొత్త ఎస్‌యూవీ వర్షెన్ లాంచ్, ధర వంటి వివరాలపై సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు కియా మోటర్స్ సెల్టోస్ కు ఫేస్ లిఫ్ట్ వర్షెన్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే