జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించనున్న కియా
సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కియా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. కొరియాలో లాంచ్ అయిన సరిగ్గా ఏడాదికి కియా సెల్టోస్ ను ఆ సంస్థ ఇండియాలో రివీల్ చేస్తోంది. ఇక కియా మోటర్స్ కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న ఈ ఎస్‌యూవీ లేటెస్ట్ వర్షెన్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ కానున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ మోడల్ బుకింగ్స్‌ను ఇప్పటికే కియా సంస్థ ప్రారంభించింది. రూ.25వేల రీఫండెబుల్ టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన డీలర్ షిప్ షోరూంలో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకొనే అవకాశం ఉంది.
ఇండియాలో సెల్టోస్ వాటా 55శాతం
2019లో సెల్టోస్ ఎస్ యూవీని లాంచ్ చేసిన కియా ఇటీవలే 5 లక్షల సేల్స్ మార్క్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇండియాలో సెల్టోస్ వాటా 55శాతం ఉందంటే ఈ మోడల్‌కు మార్కెట్లో ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కియా సెల్టోస్ లుక్ మరింత బోల్డ్ గా ఉండనుంది. ఇందులో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండెడ్ టైగర్ నోస్ గ్రిల్, ఇంటిగ్రేడెట్ డీఆర్ఎల్స్తో కూడిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలోని 5 సీటర్ కేబిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో వస్తోంది. లాంచ్ సమయంలో ధరతో పాటు ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.