Page Loader
అదిరిపోయే బెనిఫిట్స్‌తో కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ వచ్చేస్తోంది.. ఆగస్టులో లాంచ్!
కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్

అదిరిపోయే బెనిఫిట్స్‌తో కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ వచ్చేస్తోంది.. ఆగస్టులో లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్ వర్షెన్ లాంచ్ ముందే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2023 మచ్ అవైటెడ్ వాహనాల్లో కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ ఒకటి. ఇండియాలో కియా మోటర్స్ కు బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా ఉన్న ఈ ఎస్‌యూవీ లేటెస్ట్ వర్షెన్ ఇది. దేశ వ్యాప్తంగా ఈ 2023 మోడల్ బుకింగ్స్ ను సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. రూ.25వేల రీఫండెబుల్ టోకెన్ అమౌంట్ తో సంస్థకు చెందిన డీలర్ షిప్ షోరూంలో ఈ వెహికల్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ గురించి మరన్ని విషయాలను తెలుసుకుందాం. అప్డేట్ కియా సెల్టోస్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా లుక్ మరింత బోల్డ్‌గా ఉంది.

Details

కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ ఫీచర్స్ ఇవే

ఈ మోడల్‌లో ​స్కల్ప్​టెడ్​ బానెట్​, క్రోమ్​ సరౌండెడ్​ టైగర్​ నోస్​ గ్రిల్​, ఇంటిగ్రేడెట్​ డీఆర్​ఎల్స్​తో కూడిన స్లీక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ డ్యూయెల్​- టోన్​ అలాయ్​ వీల్స్​ వంటి ప్రీమియం ఫీచర్స్​ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 5 సీటర్ కేబిన్, స్పెషియస్ గా ఉండనుంది. పానారోమిక్ సన్ రూఫ్, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​ సెటప్​ వంటివి వస్తున్నాయి. దీని ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలిసే అవకాశం ఉంది. ఈకారు ఎక్స్​షోరూం ధర రూ. 10.89లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలున్నాయి.