
మరోసారి సరికొత్త రికార్డు సాధించిన కియా సెల్టోస్
ఈ వార్తాకథనం ఏంటి
కియా సెల్టోస్ విక్రయాల్లో ప్రధాన లాండ్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.
Kia Seltos Suv ప్రధాన విక్రయాల ల్యాండ్‌మార్క్‌ను సాధించింది, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి, గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ SUV, ఆగస్ట్, 2019లో అరంగేట్రం చేసినప్పటి నుండి 5 లక్షల మార్క్ ను దాటినట్లు కొరియన్ కార్ల తయారీ సంస్థ సోమవారం ప్రకటించింది.
కియా సెల్టోస్ ఎస్‌యూవీని అనంతపురంలో తయారు చేస్తోంది. విదేశీ మార్కెట్లకు కియా నుండి అత్యధికంగా ఎగుమతి చేయబడిన మోడల్ ఇదే కావడం విశేషం.
కియా భారతదేశంలో తయారు చేయబడిన 1.35 లక్షల యూనిట్ల సెల్టోస్‌ను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేసింది.
Details
కియో సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు
మేడ్-ఇన్-ఇండియా కియా సెల్టోస్ SUVలు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో విక్రయిస్తున్నారు. నెలవారీగా సగటున 9000 యూనిట్లను విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఈ ఏడాది మార్చిలో, కియా సెల్టోస్ SUVని BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది.
హుడ్ కింద 1.4-లీటర్ T-GDI యూనిట్ స్థానంలో సరికొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. సెల్టోస్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడా వస్తుంది. కొత్త సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు ఉండనుంది.
కియా త్వరలో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.