ఇండియాలోకి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది..!
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇప్పటివరకూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో రాలేదు. తాజాగా దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ అవిష్కరించింది. బెంగళూరు చెందిన మైనస్ జీరో సంస్థ జెడ్‌పాడ్ వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ కారు సైజు చిన్నగా ఉన్నా దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయగలదని మైనస్ జీరో స్పష్టం చేసింది. ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం గమనార్హం. దానికి బదులుగా హై రిసోల్యూషన్ కెమెరాలు ఉన్నాయి. ఇవి ట్రాఫిక్ తో పాటు డ్రైవింగ్ కండిషన్లలను కంట్రోల్ చేయగలవు. ఇదొక లెవల్ 5 అటానమీతో కూడుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆ సంస్థ వెల్లడించింది.
లాంచ్ పై స్పష్టత ఇవ్వని సంస్థ
అసలు మనషుల ప్రమేయం లేకుండానే ఈ వాహనం సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఆటోనోమస్ కారు ప్రస్తుతానికి క్యాంపస్, పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజెడ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మైనస్ జీరో ప్రకటించింది. ఫుల్లీ-ఆటోనోమస్ వాహనాలకు ధీటుగా ఇండియాలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకురావడమే తమ లక్ష్యమని గురుసిమ్రాన్ కాల్రా పేర్కొన్నారు. ఇండియా రోడ్లకు తగ్గట్టుగా ఆటోనోమస్ కార్లను రూపొందించేందుకు ఏఐ మీద ఈ మైనస్ జీరో ఆధారపడుతోంది. అయితే ఇండియాలలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ జెడ్ పాడ్ ఎప్పుడు లాంచ్ ఇస్తారో ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు.