Page Loader
Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!
Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ

Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 05, 2023
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. జూన్ 14న భారతదేశంలో C40 రీఛార్జ్‌ను ఆవిష్కరించడానికి వోల్వో సిద్ధమవుతోంది. దీని ఎక్స్ షోరూం ధర. 50-55 లక్షలు ఉండనుంది. దీనికి గట్టి పోటీగా హ్యుందాయ్ IONIQ 5 ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్ల గురించి తెలుసుకుందాం. వోల్వో C40 రీఛార్జ్‌లో స్లోపింగ్ రూఫ్‌లైన్, క్లామ్‌షెల్ బానెట్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, LED హెడ్‌లైట్లు "థోర్స్ హామర్" DRLలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, డిజైనర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Details

వోల్వో C40లో ఐదు-సీట్ల క్యాబిన్‌

హ్యుందాయ్ పారామెట్రిక్ డైనమిక్స్ ఫిలాసఫీని అనుసరిస్తుంది. క్లామ్‌షెల్ బానెట్, స్క్వేర్డ్ DRLలతో LED హెడ్‌ల్యాంప్‌లు, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, గ్రిల్ స్థానంలో బ్లాక్ బ్యాండ్, పిక్సలేటెడ్ LED టైల్‌లైట్లు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, 20-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. హ్యుందాయ్ IONIQ 5 ధర రూ. 45.95 లక్షలు ఉండనుంది. వోల్వో C40 ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్లతో కూడిన ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది. Volvo C40 పొడవు 4,440mm, వెడల్పు 1,873mm, ఎత్తు 1,591mm, వీల్‌బేస్ 2,702mm. హ్యుందాయ్ IONIQ 5 4,635mm పొడవు, 1,890mm వెడల్పు, 1,625mm పొడవు, వీల్‌బేస్‌ 3,000mm గా ఉంది.