MG Cars Price Hike: MG కార్ల కొనుగోలుదారులకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి మారనున్న ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
MG మోటార్ ఇండియా తన వాహనాల ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. కంపెనీ తెలిపిన ప్రకారం సుమారు 2 శాతం వరకు ధరలు పెరుగుతాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు MG వెల్లడించింది. అయితే MG Select లైన్-అప్‌లో ఉన్న మోడళ్ల ధరలు మాత్రం పెరగవు. ప్రస్తుతంఈ లైన్‌లో MG M9 Presidential Limo, MG Cyberster ఉన్నాయి. కస్టమర్లు తమకు సంబంధించిన మోడల్ ధరల తాజా వివరాల కోసం సమీపంలోని MG డీలర్‌షిప్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ సూచించింది.
వివరాలు
Majestor కోసం ప్రత్యేక 5-5-5 ప్యాకేజ్
ప్రస్తుతం భారత మార్కెట్‌లో MG Comet EV, ZS EV,Astor,Hector, Windsor EV వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మరోవైపు,త్వరలో విడుదల కానున్న Majestor SUV కోసం MG కొత్త ఓనర్‌షిప్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. భారతదేశంలో తొలి D+సెగ్మెంట్ SUVగా ఈ మోడల్‌ను కంపెనీ స్థాపిస్తోంది."5-5-5 ప్రోగ్రామ్" పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజ్ ద్వారా కస్టమర్లకు దీర్ఘకాలిక వాడకంలో వచ్చే సమస్యలను తగ్గించే ప్రయత్నం చేసింది. ఈ ప్యాకేజ్‌లో 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్, అలాగే ఐదు సార్లు లేబర్ ఛార్జీలు లేకుండా సర్వీసింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇతర కంపెనీల్లో అదనపు చార్జీలతో వచ్చే ఈ సదుపాయాలను MG మాత్రం స్టాండర్డ్‌గా అందిస్తోంది.
వివరాలు
వినియోగదారులకు ఎలా ఉపయోగం?
ఈ 5-5-5 ప్లాన్ ద్వారా కస్టమర్లకు కిలోమీటర్ పరిమితి లేకుండా వారంటీ కవరేజ్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఐదు సంవత్సరాల పాటు బ్రేక్‌డౌన్ సపోర్ట్ అందుతుంది. అలాగే ప్రారంభ సంవత్సరాల్లో సర్వీస్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఎక్కువగా ప్రయాణించే వారు, లాంగ్ డ్రైవ్ చేసే వారు, ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు ఈ ప్యాకేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.