MG Hector Hawk: త్వరలో ఇండియాలోకి కొత్త SUV.. ఫీచర్లు, రేంజ్, ధర తెలిస్తే షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు JSW MG Motor సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త SUVని ఆగస్టు 26, 2026న లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి 'హెక్టర్ హాక్' అనే పేరు పెట్టే అవకాశాలున్నాయి. ఈ SUVలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. అయితే లాంచ్ సమయంలోనే తుది పేరు, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించనుంది. MGకి ఉన్న రగ్డ్ SUV లుక్‌కు ఆధునిక ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీని జోడించి హాక్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ మార్కెట్లలో విక్రయిస్తున్న Wuling Starlight 560 ఆధారంగా ఈ కొత్త SUVని రూపొందిస్తున్నారు. MG కొత్తగా అభివృద్ధి చేసిన ADAPT ఆర్కిటెక్చర్‌పై తయారయ్యే తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే కానుంది.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు..
ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాల నుంచి స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, రేంజ్-ఎక్స్‌టెండర్ పవర్‌ట్రెయిన్‌ల వరకు వివిధ రకాల పవర్‌ట్రెయిన్‌లకు అనుగుణంగా ఈ ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
హెక్టర్ హాక్ PHEV వెర్షన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది.
విదేశీ స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ సెటప్ ద్వారా 197 hp పవర్, 230 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది.
ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సమాచారం.
రెండు పవర్ సోర్స్‌లను కలిపి ఉపయోగిస్తే మొత్తం రేంజ్ సుమారు 1,100 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా.
వివరాలు
ధర వివరాలు ఇవే..
హెక్టర్ హాక్ ధర రూ.20 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
స్థానికంగా ఎంత మేర ఉత్పత్తి చేస్తారు, వేరియంట్లలో అందించే ఫీచర్లు, అలాగే MG తన Battery-as-a-Service ప్రోగ్రామ్‌ను అందిస్తుందా లేదా అనే అంశాలపై తుది ధర ఆధారపడి ఉంటుంది.
ఇక పోటీ విషయానికి వస్తే.. హాక్ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ నేరుగా మహీంద్రా XEV 9Sతో పోటీ పడనుంది.
ఈ ఏడాది చివర్లో రానున్న ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ మహీంద్రా XUV 7XO, టాటా సఫారీలకు కూడా పోటీగా నిలవనుంది.
కొలతల పరంగా చూస్తే.. రాబోయే హెక్టర్ హాక్ పొడవు 4,745 మిల్లీమీటర్లు, వెడల్పు 1,850 మిల్లీమీటర్లు, ఎత్తు 1,770 మిల్లీమీటర్లు ఉంటుంది.
వివరాలు
సీటింగ్ ఎలా ఉంటుందంటే..
వీల్‌బేస్ 2,810 మిల్లీమీటర్లు. ఈ కొలతలతో చూస్తే హెక్టర్ ప్లస్ కంటే హెక్టర్ హాక్ పెద్దదిగా ఉంటుంది.
పెరిగిన పరిమాణం కారణంగా ఇందులో మూడు వరుసల సీటింగ్‌తో మొత్తం ఏడు సీట్లు అందించే అవకాశం ఉంది.
దీంతో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రాక్టికల్ SUVగా హాక్‌ను MG తీసుకురానుంది.
డిజైన్ విషయానికి వస్తే.. హెక్టర్‌తో పోలిస్తే హాక్ పూర్తిగా భిన్నమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది.
స్లిమ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్స్, స్క్వేర్ ఆకారంలోని వీల్ ఆర్చ్‌లు, దాదాపు నిలువుగా ఉండే టెయిల్‌గేట్ దీని ప్రధాన డిజైన్ హైలైట్స్‌గా ఉన్నాయి. ఇవన్నీ SUVకి మరింత నిటారుగా, రగ్డ్ లుక్‌ను అందిస్తాయి.