MINI Cooper SE 2026: రూ.53.90 లక్షల ధరతో MINI ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 402 కి.మీ.!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లోకి MINI రెండో తరం ఆల్-ఎలక్ట్రిక్ Cooper SE హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను రూ.53.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది. ఇందులో 54.2kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 402 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 218hp పవర్, 330Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
6.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం
కొత్త MINI Cooper SEలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) లేఅవుట్‌ను అందించారు.
ఈ కారు కేవలం 6.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 95kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
దీని ద్వారా బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో క్లాసిక్ MINI Cooper స్టైలింగ్‌ను కొనసాగించారు. అయితే మూసివేసిన గ్రిల్, ముందు భాగం, టెయిల్‌గేట్‌పై పసుపు రంగు S బ్యాడ్జింగ్ వంటి ప్రత్యేక మార్పులు చేశారు.
వివరాలు
నిట్‌డ్ డ్యాష్‌బోర్డ్.. పనోరమిక్ గ్లాస్ రూఫ్
MINI Cooper SE ఇంటీరియర్‌లో మధ్య భాగంలో ఉండే సిగ్నేచర్ సర్క్యులర్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కొనసాగించారు.
ఇదే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గానూ పనిచేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్ కార్డ్స్‌పై నిట్‌డ్ ఫినిషింగ్‌ను అందించారు.
ఇందులో పనోరమిక్ గ్లాస్ రూఫ్, హీటెడ్ స్పోర్ట్ వెసిన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ముందు సీట్లను ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
డ్రైవర్ సీటుకు మెమరీ ఫంక్షన్‌తో పాటు యాక్టివ్ సీట్ ఫీచర్‌ను కూడా అందించారు.
వివరాలు
9.4 ఇంచుల OLED టచ్‌స్క్రీన్
ఈ కారులో 9.4 ఇంచుల ఆల్-డిజిటల్ OLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గానూ పనిచేస్తుంది.
ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, MINI నావిగేషన్, ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్, రిమోట్ సర్వీసెస్, డిజిటల్ కీ ప్లస్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లలో హర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్‌అప్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి.
వివరాలు
లెవల్ 2 ADAS భద్రతా ఫీచర్లు
2026 MINI Cooper SEలో లెవల్ 2 ADAS ఫీచర్లను అందించారు.
ఇందులో ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ వార్నింగ్, స్పీడ్ వార్నింగ్, డ్రైవర్ అటెన్టివ్‌నెస్ అసిస్టెన్స్ ఉన్నాయి.
వీటితో పాటు బ్రేక్ ఇంటర్వెన్షన్‌తో కూడిన రియర్ క్రాసింగ్ ట్రాఫిక్ వార్నింగ్, ఎగ్జిట్ వార్నింగ్, రియర్ కొలిజన్ ప్రివెన్షన్, రివర్సింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇతర భద్రతా సదుపాయాల్లో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.