Motul: మోతుల్ భారీ ప్లాన్.. భారత యువ రైడర్ల కోసం ఐఫోన్ బ్రాండ్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ లూబ్రికెంట్ తయారీ సంస్థ మోతుల్ ఇండియా భారత మార్కెట్లోకి ఫ్రెంచ్ ప్రీమియం లూబ్రికెంట్ బ్రాండ్ ఐపోన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. పనితీరు, స్టైల్, రైడర్ కల్చర్ కలయికగా గుర్తింపు పొందిన ఈ బ్రాండ్, భారత యువ బైక్ రైడర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది కేవలం కొత్త ఇంజిన్ ఆయిల్ శ్రేణి ప్రారంభం మాత్రమే కాకుండా, యువతకు ప్రీమియం లైఫ్‌స్టైల్ ఎంపికగా ఐఫోన్‌ను నిలబెట్టే ప్రయత్నమని కంపెనీ వెల్లడించింది. జపనీస్ కల్చర్ నుంచి ప్రేరణ పొందిన ఈ 100 శాతం మోటార్‌సైకిల్ ఇంజిన్ ఆయిల్ బ్రాండ్, స్టైల్, స్పీడ్, పెర్ఫార్మెన్స్ కోరుకునే కొత్త తరం రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
వివరాలు
రైడర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తుల విభజన
సంప్రదాయ ఇంజిన్ ఆయిల్ బ్రాండ్లకు భిన్నంగా, రైడర్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఐఫోన్ బ్రాండ్‌ను తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా పనితీరు లూబ్రికెంట్లలో ప్రమాణంగా నిలిచిన మోతుల్ సాంకేతిక నైపుణ్యం, పరిశ్రమ అనుభవం ఈ కొత్త శ్రేణికి బలంగా నిలుస్తున్నాయి. జూడో బెల్ట్ ప్రోగ్రెషన్ సిస్టమ్‌ను ఆధారంగా తీసుకుని, ప్రతి రేంజ్‌ను వేర్వేరు రైడింగ్ స్థాయిలకు అనుగుణంగా రూపొందించారు. రోజువారీ కమ్యూటింగ్ నుంచి హై-పర్ఫార్మెన్స్ రేసింగ్ వరకు ప్రతి రైడర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తులను విభజించారు.
వివరాలు
ఆయిల్స్ వాటాలో దాదాపు నాలుగో వంతు
ఈ సందర్భంగా నాగేంద్ర పై మాట్లాడుతూ.. "పెర్ఫార్మెన్స్ లూబ్రికెంట్ల శాస్త్రీయ అభివృద్ధిపై Motul తన గ్లోబల్ గుర్తింపును నిర్మించుకుంది. ప్రస్తుతం మా అమ్మకాలలో ప్రీమియం, సింథటిక్ ఆయిల్స్ వాటా దాదాపు నాలుగో వంతు ఉంది. యువ రైడర్లు ఇప్పుడు అడ్వెంచర్ రైడింగ్, ఆఫ్‌రోడింగ్, హై-పర్ఫార్మెన్స్ అనుభవాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అత్యుత్తమ లూబ్రికేషన్ టెక్నాలజీని అందించడమే కాకుండా, నిజమైన ప్రీమియమైజేషన్‌ను తీసుకురావడమే ఐఫోన్ లక్ష్యమని తెలిపారు. అలాగే మోతుల్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ గతంలో కంటే మరింత బలపడిందని, దీంతో దేశవ్యాప్తంగా రైడర్లకు ఐఫోన్ సులభంగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
వివరాలు
ఐఫోన్ రేంజ్‌లు ఇవే..
బ్లాక్ బెల్ట్ - రేసింగ్ రేంజ్ 'షోగన్' ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తితో కూడిన ఈ రేంజ్ జపనీస్ DNA ఆధారంగా రూపొందించబడింది. హై-పర్ఫార్మెన్స్ రైడింగ్‌కు గరిష్ట రక్షణ అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రెడ్ బుల్ మోటోజిపి రూకీస్ కప్‌లో షోగన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని కంపెనీ తెలిపింది. బ్లూ బెల్ట్ - స్పోర్ట్ రేంజ్ పూర్తిగా సింథటిక్ ఆయిల్స్‌తో రూపొందిన ఈ రేంజ్ రోడ్డు, ఆఫ్‌రోడ్ రెండింటిలోనూ మెరుగైన ఇంజిన్ పనితీరును అందించేందుకు తయారు చేశారు. రాజీ లేని పెర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకోసం ఇది ప్రత్యేకం. సెమీ సింథటిక్ ఫార్ములేషన్‌తో రూపొందిన ఈ రేంజ్ రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.తక్కువ ఖర్చుతో మెరుగైన ఇంజిన్ రక్షణ కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది
వివరాలు
యెల్లో బెల్ట్ - స్టాండర్డ్ రేంజ్
అందుబాటు ధరలో నాణ్యమైన ఇంజిన్ ఆయిల్స్ అందించే రేంజ్ ఇది. ప్రతి స్థాయి రైడర్‌కు సమర్థవంతమైన పనితీరు అందించడమే దీని లక్ష్యం. మరోవైపు మిలింద్ ఆచార్య మాట్లాడుతూ.. ప్రస్తుత యువ రైడర్లు పనితీరుతో పాటు తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బ్రాండ్లను ఎంచుకుంటున్నారు. ఐఫోన్ ద్వారా భారతీయ రైడర్లకు అధునాతనPAO, ఎస్టర్ ఆధారిత లూబ్రికేషన్ టెక్నాలజీతో పాటు ప్రత్యేకమైన జపనీస్ స్టైల్‌ను అందిస్తున్నాం. బెల్ట్ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థ వల్ల రైడర్లు తమ అవసరాలకు సరిపోయే లూబ్రికెంట్‌ను సులభంగా ఎంచుకోవచ్చని తెలిపారు. ప్రారంభ దశలో దేశంలోని ఆరు ప్రధాన, 14కీలక మార్కెట్లలో ఐఫోన్ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు మోతుల్ వెల్లడించింది. యువతను ఆకర్షించేందుకు డిజిటల్ ఆధారిత ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది.