TVS Ronin Sales : టీవీఎస్ నుంచి కొత్త బైక్.. ఫీచర్లు, ధర వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ. నుంచి మ సరికొత్త మోడల్ రాబోతోంది. ఇప్పటికే TVS Ronin బైక్ మార్కెట్లో మంచి స్పందన పొందగా, ఇప్పుడు అదే మోడల్‌కు కేఫ్ రేసర్ వెర్షన్‌ను కంపెనీ తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Details
అమ్మకాలలో భారీ పెరుగుదల
టీవీఎస్ రోనిన్‌కు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. 2026 ఫిబ్రవరిలోనే 8 వేలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది ప్రారంభంలో నెలకు 4-5 వేల యూనిట్లు మాత్రమే అమ్ముడవుతుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 8 వేల దాటింది.
దీంతో ఈ బైక్ తక్కువ సమయంలోనే మార్కెట్లో భారీ పాపులారిటీ సంపాదించింది.
కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ రెడీ
మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రోనిన్ రేంజ్‌ను విస్తరించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. తాజాగా కేఫ్ రేసర్ వెర్షన్‌కు సంబంధించి డిజైన్ పేటెంట్ కూడా దాఖలు చేసింది.
త్వరలోనే ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Details
స్పోర్టీ, స్టైలిష్ డిజైన్
డిజైన్ పరంగా కొత్త రోనిన్ కేఫ్ రేసర్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో:
క్వార్టర్ ఫెయిరింగ్
క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు (తక్కువ ఎత్తులో)
వెనుక భాగంలో ఫుట్‌పెగ్‌లు
సింగిల్ సీట్ సెటప్
షార్ట్ ఎగ్జాస్ట్
ఈ ఫీచర్లు క్లాసిక్ కేఫ్ రేసర్ ఫీల్‌ను అందిస్తాయి
మెరుగైన ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే
గుండ్రని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే భిన్నమైన డిజైన్
స్పోర్టీ టైర్లు, కొత్త గ్రాఫిక్స్ ఇవి బైక్‌కు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి.
Details
పర్ఫార్మెన్స్ ఎలా?
ఈ కొత్త వెర్షన్‌లో కూడా 225.9cc ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఇది:
20.4 PS పవర్
19.93 Nm టార్క్
ఉత్పత్తి చేస్తుందని అంచనా. అలాగే సస్పెన్షన్, రైడింగ్ డైనమిక్స్‌లో మార్పులు చేసి మరింత స్టేబుల్, స్పోర్టీ రైడ్ అందించేలా కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
లాంచ్ ఎప్పుడు?
ఇప్పటివరకు అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే, TVS Ronin Cafe Racer వెర్షన్ ఎప్పుడైనా భారత మార్కెట్లోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు.