Vida VX2 Go: హీరో విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. బిగ్ బ్యాటరీతో వీఎక్స్2 గో లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)తన విద్యుత్ వాహన బ్రాండ్ 'విడా' (Vida)పరిధిని మరింత విస్తరించింది. తాజాగా సంస్థ 'విడా వీఎక్స్2 గో'(Vida VX2 Go)పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ధరను సంస్థ రూ.1.02 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం విడా పోర్ట్‌ఫోలియోలో వీఎక్స్2 ప్లస్ వేరియంట్ మాత్రమే 3.4 kWhబ్యాటరీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడు అదే శక్తివంతమైన బ్యాటరీని వీఎక్స్2 గో మోడల్‌లోనూ ప్రవేశపెట్టింది. ఈ మోడల్ డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభం కానున్నాయి. వీటిని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(BaaS)మోడల్‌లో కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.
Details
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల ప్రయాణం
ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తే వీఎక్స్2 గో ధర రూ.60వేలకు తగ్గిపోతుంది. అయితే, వినియోగదారు ప్రయాణించిన దూరానికి అనుగుణంగా కిలోమీటరుకు 90పైసల చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. వీడా వీఎక్స్2 గోలోని మోటార్ 6 kWపవర్, 26 Nmటార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇందులో ఎకో, రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే రియల్‌టైమ్‌లో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు(టాప్ స్పీడ్)గా ఉంటుంది. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. అంటే వీటిని ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న వీఎక్స్2గో మోడల్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది.