LOADING...
Kia Sonet facelift : కొత్త కియా సోనెట్ వచ్చేస్తోంది.. హైబ్రిడ్ ఇంజిన్‌తో భారీ అప్‌గ్రేడ్!
కొత్త కియా సోనెట్ వచ్చేస్తోంది.. హైబ్రిడ్ ఇంజిన్‌తో భారీ అప్‌గ్రేడ్!

Kia Sonet facelift : కొత్త కియా సోనెట్ వచ్చేస్తోంది.. హైబ్రిడ్ ఇంజిన్‌తో భారీ అప్‌గ్రేడ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన కియా సోనెట్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి కియా మోటార్స్ సంస్థ సిద్ధమవుతోంది. 2027లో మార్కెట్‌లోకి రానున్న ఈ కొత్త తరం సోనెట్ (కోడ్ నేమ్: QY2E) డిజైన్ పరంగానే కాకుండా సాంకేతికత పరంగా కూడా భారీ మార్పులతో రానుందని సమాచారం. కియా సోనెట్ తొలిసారిగా సెప్టెంబర్ 2020లో విడుదలై, జనవరి 2024లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పొందింది. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి కొత్త జనరేషన్ మోడల్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సోనెట్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు

కొత్త ప్లాట్‌ఫారమ్, ఎక్కువ స్పేస్

ప్రస్తుతం సోనెట్ కే2 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడగా, కొత్త మోడల్ కే1 ప్లాట్‌ఫారమ్‌కు మారనుంది. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను కియా సైరోస్‌లో కూడా ఉపయోగించారు. దీని వల్ల వెనుక సీటు స్పేస్ సమస్య పెద్దగా తగ్గనుంది. కొత్త వెర్షన్‌లో వీల్‌బేస్ పెరగడంతో వెనుక కూర్చునే ప్రయాణికులకు లెగ్ రూమ్, షోల్డర్ రూమ్ మరింతగా లభించనుంది. హైబ్రిడ్ ఇంజిన్ అప్‌డేట్ ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగనున్నాయి. అయితే కొత్తగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా కియా అభివృద్ధి చేస్తోంది. ఇది వెంటనే అందుబాటులోకి రాకపోయినా 2028 లేదా 2029 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

వివరాలు

నెక్ట్స్ లెవల్ ఫీచర్లు

కొత్త సోనెట్‌లో టెక్నాలజీ పరంగా పెద్ద అప్‌గ్రేడ్లు రానున్నాయి. 10.25 ఇంచ్ స్క్రీన్ల స్థానంలో 12.3 ఇంచ్ డ్యూయల్ డిస్‌ప్లేలు అందుబాటులోకి రానున్నాయి. భద్రత పరంగా లెవల్ 2 అడాస్ సిస్టమ్ (కెమెరా, రాడార్ ఆధారిత) తీసుకురానున్నారు. కే1 ప్లాట్‌ఫారమ్‌లో హై-స్ట్రెంత్ స్టీల్ వాడడం వల్ల భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించడం లక్ష్యంగా కియా పనిచేస్తోంది. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి కియా ఈ కొత్త సోనెట్‌తో సిద్ధమవుతోంది. ఏడాదికి సుమారు 85,000 యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement