LOADING...
Tata Punch EV : కొత్త టాటా పంచ్ ఈవీ.. బ్యాటరీ రేంజ్, వేరియంట్లు, ధర వివరాలివే!
కొత్త టాటా పంచ్ ఈవీ.. బ్యాటరీ రేంజ్, వేరియంట్లు, ధర వివరాలివే!

Tata Punch EV : కొత్త టాటా పంచ్ ఈవీ.. బ్యాటరీ రేంజ్, వేరియంట్లు, ధర వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 మోడల్‌ టాటా పంచ్ ఈవీ భారత మార్కెట్‌లో అప్‌డేట్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ బరువు 1360 కేజీలు కాగా, 195 మి.మీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. అంతేకాదు, 450 మి.మీ లోతున్న నీటిలో కూడా సులభంగా ప్రయాణించగల సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించింది.

Details

డిజైన్‌లో మార్పులు

కొత్త పంచ్‌ ఈవీ పాత సిల్హౌట్‌ను కొనసాగిస్తూ ఫ్రంట్‌ డిజైన్‌లో మార్పులు చేసింది. ముందు భాగం మరింత క్లీన్‌గా కనిపించేలా పాత మోడల్‌లో ఉన్న బ్లాక్‌ స్ట్రిప్‌ను తొలగించి, క్లోజ్డ్‌ గ్రిల్‌ను మాత్రమే ఉంచారు. సైడ్‌ ప్రొఫైల్‌ మాత్రం గత మోడల్‌లాగే ఉంటుంది. ఫ్రంట్‌లో పుల్‌-స్టైల్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ఇచ్చారు. రియర్‌ డోర్‌ హ్యాండిల్స్‌ను సీ-పిల్లర్‌కు ఫిక్స్‌ చేశారు. ఇంటీరియర్‌లో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గత మోడల్‌లో ఉన్న 10.2ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను 12.3 ఇంచ్‌ యూనిట్‌తో భర్తీ చేశారు. హయ్యర్‌ వేరియంట్లలో ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఉదయ్‌పూర్‌ థీమ్‌తో లెథరెట్‌ అప్‌హోలిస్ట్రీ, డ్యూయల్‌ టోన్‌ డ్యాష్‌బోర్డ్‌, లైట్‌ కలర్‌ స్కీమ్‌, టాగిల్‌ స్విచ్‌లతో క్యాబిన్‌ ఆకట్టుకునేలా రూపొందించారు.

Details

బ్యాటరీ, రేంజ్

పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో గరిష్టంగా 468 కి.మీ వరకు రేంజ్‌ ఇస్తుంది. పాత 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ కూడా కొనసాగుతోంది. ఇది 270 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. అయితే, గతంలో ఉన్న 25 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ను కంపెనీ తొలగించింది.

Advertisement

Details

ధరలు (ఎక్స్‌షోరూం)

30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ స్మార్ట్‌ - రూ. 9.69 లక్షలు స్మార్ట్‌+ - రూ. 10.29 లక్షలు 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ స్మార్ట్‌+ - రూ. 10.89 లక్షలు అడ్వెంచర్‌ - రూ. 11.59 లక్షలు ఎంపవర్డ్‌ - రూ. 12.29 లక్షలు ఎంపవర్డ్‌+ ఎస్‌ - రూ. 12.59 లక్షలు

Advertisement

Details

BaaS ప్రోగ్రామ్

ఈ 2026 పంచ్‌ ఈవీతో కంపెనీ బీఏఏఎస్‌ (Battery as a Service) ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధరను రూ. 6.49 లక్షలకు అందిస్తోంది. అయితే, అదనంగా ప్రతి కిలోమీటర్‌కు రూ. 2.6 చొప్పున బ్యాటరీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా, కొత్త డిజైన్‌, పెరిగిన రేంజ్‌, ఆధునిక ఫీచర్లతో 2026 టాటా పంచ్‌ ఈవీ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది.

Advertisement