NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల
    అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2025
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా' తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 'యాక్సెస్‌'కు కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది.

    ఈ కొత్త ఎడిషన్‌కు 'రైడ్ కనెక్ట్' అనే పేరు పెట్టారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,01,900గా నిర్ణయించారు.

    ఈ కొత్త ఎడిషన్‌ ప్రధాన ఆకర్షణలలో పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ అనే కలర్ స్కీమ్, 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉన్నాయి.

    ఇది అత్యుత్తమ విజువల్స్, వేగవంతమైన రిఫ్రెష్ రేట్లు, అధిక కాంట్రాస్ట్, ఖచ్చితమైన రంగులను చూపించగలదు.

    Details

    రంగుల ఎంపికలు

    కొత్తగా ప్రవేశపెట్టిన పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ తో పాటు యాక్సెస్‌ స్కూటర్ ప్రస్తుతం ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది

    మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం. 2

    మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ

    పెర్ల్ గ్రేస్ వైట్

    సాలిడ్ ఐస్ గ్రీన్

    పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ (కొత్తగా)

    Details

    పవర్‌ట్రైన్ & ఫీచర్లు 

    ఈ వేరియంట్‌లో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఇది 6,500 RPM వద్ద 8.31 bhp శక్తిని, 5,000 RPM వద్ద 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్, కిక్, ఎలక్ట్రిక్ స్టార్టర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    సస్పెన్షన్, బ్రేకింగ్ & టైర్

    ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్

    వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ సస్పెన్షన్

    బ్రేకింగ్‌కు ముందు డ్రమ్/డిస్క్ బ్రేక్

    వెనుక డ్రమ్ బ్రేక్

    టైర్ పరిమాణం: ముందు - 90/90,

    వెనుక - 90/100

    బరువు: 106 కిలోలు

    ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 5.3 లీటర్లు

    Details

    డిజైన్ & అదనపు సౌకర్యాలు

    ముందు LED హెడ్‌ల్యాంప్, వెనుక LED టెయిల్ లైట్

    వన్ పుష్ సెంట్రల్ లాక్ సిస్టమ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్

    ఇంజిన్ కిల్ స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్

    ముందు భాగంలో యుటిలిటీ పాకెట్లు, రెండు హుక్స్,

    సీటు కింద హుక్స్, స్టోరేజ్ స్పేస్

    Details

    అధికారిక ప్రకటన

    సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడుతూ: "సుజుకీ యాక్సెస్ పట్టణ రైడర్లకు విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది.

    తాజా అప్‌డేట్‌లో ఆధునిక డిజిటల్ టెక్నాలజీ, స్టైలిష్ రంగు ఎంపికలతో ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచుతుందని పేర్కొన్నారు.

    ఈ కొత్త ఎడిషన్‌తో యాక్సెస్ స్కూటర్ మార్కెట్‌లో తన విజయాన్ని మరింత బలోపేతం చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్కూటర్
    ఆటో మొబైల్

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    స్కూటర్

    హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్ ఆటో మొబైల్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ ఆటో మొబైల్
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    Revolt RV BlazeX: రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్‌ విడుదల.. ధర ఎంతంటే? ఆటోమొబైల్స్
    Kia EV4: సెడాన్, హ్యాచ్‌బ్యాక్ వెర్షన్లలో కియా ఈవీ4.. 630 కిమీ రేంజ్, హై-పర్ఫార్మెన్స్ వివరాలు ఇవే! కియా మోటర్స్
    Maruti Suzuki Alto K10: బడ్జెట్ కారులో హై సేఫ్టీ! ఆల్టో K10 అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మారుతీ సుజుకీ
    Maruti Suzuki Sales : భారత మార్కెట్లో మారుతి సుజుకి హవా.. ఫిబ్రవరిలో 1.6 లక్షల కార్ల విక్రయాలు  మారుతీ సుజుకీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025