Nissan Gravite: 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌తో నిస్సాన్ గ్రావిటీ.. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థానం బలపర్చుకోవడానికి నిస్సాన్ ప్రవేశపెట్టిన కొత్త ఆయుధం నిస్సాన్ గ్రావిటీ. బడ్జెట్ ఫ్రెండ్లీగా, 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీగా వచ్చిన ఈ మోడల్ లాంచ్ అయిన నాటి నుంచి మంచి చర్చకు దారి తీసింది. మీరు కూడా ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరల వివరాలు తెలుసుకోవడం అవసరం.
Details
హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ ఆన్‌రోడ్ ధరలు
విసియా - రూ. 6.72 లక్షలు అసెంటా - రూ. 7.82 లక్షలు ఎన్-కనెక్టా - రూ. 8.54 లక్షలు ఎన్-కనెక్టా ఈజెడ్ షిఫ్ట్ - రూ. 9.24 లక్షలు టెక్నా - రూ. 9.37 లక్షలు టెక్నా లాంచ్ ఎడిషన్ - రూ. 9.90 లక్షలు టెక్నా ఈజెడ్ షిఫ్ట్ - రూ. 10.06 లక్షలు టెక్నా లాంచ్ ఎడిషన్ ఈజెడ్ షిఫ్ట్ - రూ. 10.58 లక్షలు
Details
ఎంపీవీ ధరలు రూ. 6.72 లక్షల నుంచి
అంటే హైదరాబాద్‌లో ఈ 7 సీటర్ ఎంపీవీ ధరలు రూ. 6.72 లక్షల నుంచి రూ. 10.58 లక్షల వరకు ఉంటాయి. ఈ ధరల శ్రేణిలో 7 సీటర్ వాహనం అందుబాటులో ఉండటం మధ్యతరగతి కుటుంబాలకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. సాధారణంగా ఏదైనా కొత్త కారు విడుదల సమయంలో సంస్థలు ఎక్స్-షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ ఆన్‌రోడ్ ధరలో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్డు పన్నులు వంటి అంశాలు చేరుతాయి. రాష్ట్రానికో రాష్ట్రం పన్నుల రేట్లు మారుతుండటంతో ఆన్‌రోడ్ ధరలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే కారు కొనుగోలు ముందు పూర్తి ఆన్‌రోడ్ ధర తెలుసుకుని బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మంచిది.
Details
డెలివరీ ఎప్పటి నుంచి?
సమీప డీలర్‌షిప్‌ను సందర్శిస్తే టెస్ట్ డ్రైవ్‌తో పాటు ప్రస్తుత లాంచ్ ఆఫర్లపై సమాచారం పొందవచ్చు. దాని ఆధారంగా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయవచ్చు. నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీకి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మైలేజ్ వివరాలు ఈ ఎంపీవీలో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 19.3 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్ ఇస్తుందని, ఏఎంటీ (AMT) ట్రాన్స్‌మిషన్‌తో 19.6 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది.
Details
సేఫ్టీ ఫీచర్లు
ఈ 7 సీటర్ అఫార్డబుల్ ఎంపీవీలో మొత్తం 45 యాక్టివ్ మరియు పాసివ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అందులో 30కుపైగా ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. ముఖ్యమైన వాటిలో: 6 ఎయిర్‌బ్యాగులు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) హిల్ స్టార్ట్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ట్రాక్షన్ కంట్రోల్ బ్రేక్ అసిస్ట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) సేఫ్టీ, మైలేజ్, ధర—మొత్తం కలిపి చూస్తే నిస్సాన్ గ్రావైట్ మధ్యతరగతి కుటుంబాలకు సరైన ఫ్యామిలీ వాహనంగా నిలుస్తోంది.