Norton Manx R: టీవీఎస్ చేతికి నార్టన్.. భారత్‌లో రెండు కొత్త బైక్స్ లాంచ్‌కు రంగం సిద్ధం?
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం బైక్ బ్రాండ్ నార్టన్ భారత్‌లో తన మార్కెట్ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. TVS గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ.. తన Atlas GT టూరర్, Manx R సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిళ్లకు భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసింది. ఈ పరిణామం చూస్తుంటే వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో ఈ బైక్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీటి రాకపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పేటెంట్ దాఖలు చేసినంత మాత్రాన మార్కెట్లోకి తీసుకొస్తారని ఖచ్చితంగా చెప్పలేం. అయితే, ఒక నిర్దిష్ట మార్కెట్ కోసం మోడల్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు సాధారణంగా తయారీ సంస్థలు డిజైన్ పేటెంట్లు దాఖలు చేస్తుంటాయి.
వివరాలు
పరిశీలనలో సంస్థ
ఇప్పటికే Manx Rకు భారత్‌లో పేటెంట్ పొందిన నార్టన్.. తాజాగా Atlas GTను కూడా ఈ జాబితాలో చేర్చింది.
దీంతో దేశీయ ప్రీమియం బైక్ విభాగంలో ఈ రెండు మోడళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సంస్థ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ బైక్‌లు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో Atlas మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ టూరర్ కాగా.. Manx R సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్. 2020లో TVS సంస్థ నార్టన్‌ను కొనుగోలు చేసింది.
అప్పటి నుంచి ఈ బ్రాండ్‌ను తిరిగి పుంజుకునేలా చేసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ప్రస్తుతం నార్టన్ లైనప్‌లో Atlas అడ్వెంచర్ ఫ్యామిలీ, Manx నేకెడ్, Manx R సూపర్‌స్పోర్ట్ మోడళ్లు ఉన్నాయి. త్వరలో 450cc Roadster కూడా రానుంది.
వివరాలు
Norton Atlas GT.. లాంగ్ రైడ్స్ కోసం ప్రత్యేకంగా
భారత్‌లో విక్రయాలు ప్రారంభిస్తే ఈ విస్తృతమైన మోడల్ శ్రేణి సంస్థకు ఉపయోగపడనుంది. Norton Atlas GT అనేది సంస్థకు చెందిన 585cc అడ్వెంచర్ ప్లాట్ఫామ్లో మరింత రోడ్-ఫోకస్డ్ వెర్షన్. సాధారణ Atlasలో వైర్-స్పోక్ వీల్స్ ఉంటాయి.
కానీ GT మోడల్లో ముందు, వెనుక రెండు వైపులా అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఆఫ్‌రోడ్ రైడింగ్ కంటే సుదూర ప్రయాణాలకు అనువైన టూరర్గా ఇది నిలవనుంది.
ఈ బైక్‌లో అదే 585cc DOHC ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. 270 డిగ్రీ క్రాంక్‌తో పనిచేసే ఈ ఇంజిన్ 9,300 rpm వద్ద 69 bhp శక్తిని, 7,500 rpm వద్ద 57.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
దద
6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ను జతచేశారు.
Atlas మోడల్‌కు సంబంధించిన ఇతర హార్డ్‌వేర్ ఫీచర్లలో 15.4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 845 మి.మీ. సీట్ హైట్, 220 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్, 1,465 మి.మీ. వీల్‌బేస్ ఉన్నాయి.
KYB పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్కులు 180 మి.మీ. ట్రావెల్‌ను అందిస్తాయి. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో రెండు 320 మి.మీ. డిస్కులు, వెనుకవైపు 270 మి.మీ. డిస్క్ ఇచ్చారు.
19 అంగుళాల ముందు వీల్, 17 అంగుళాల వెనుక వీల్ కాంబినేషన్ ఈ బైక్ రోడ్-ఫోకస్డ్ స్వభావాన్ని తెలియజేస్తుంది.
వివరాలు
Atlas Apexలో అదనపు ఫీచర్లు
Atlas Apex అనేది ఈ మోడల్లో అధిక స్పెసిఫికేషన్ కలిగిన వెర్షన్.
ఇందులో ఎలక్ట్రానిక్ కంబైన్డ్ బ్రేకింగ్, హీటెడ్ గ్రిప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెహికల్ హోల్డ్ అసిస్ట్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, కార్నరింగ్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 8 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, GoPro కంట్రోల్స్, టెలిమాటిక్స్, Norton Rider యాప్ ఇంటిగ్రేషన్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
వివరాలు
Norton Manx R.. 206 bhp శక్తితో సూపర్‌స్పోర్ట్
మరోవైపు నార్టన్ Manx R సంస్థ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన సూపర్‌స్పోర్ట్ మోడల్‌గా నిలుస్తోంది.
1,200cc V4 ఇంజిన్‌తో రూపొందించిన ఈ బైక్.. 200 bhp సామర్థ్యం కలిగిన సూపర్‌బైక్‌ల విభాగంలో పోటీ పడేలా తయారైంది. 72 డిగ్రీల V4 ఇంజిన్ 11,500 rpm వద్ద 206 bhp శక్తిని, 9,000 rpm వద్ద 130 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ను జతచేశారు. ఈ బైక్‌లో ఆరు యాక్సిస్ IMU ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఉంది.
వీలీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్‌తోపాటు పలు రైడింగ్ మోడ్లు అందించారు. 8 అంగుళాల TFT డిస్ప్లే కూడా ఉంది.
వివరాలు
నాలుగు వేరియంట్లలో Manx R
బ్రేకింగ్ కోసం Brembo Hypure కాలిపర్లు, టైర్ల కోసం ముందు 120 సెక్షన్, వెనుక 200 సెక్షన్ కలిగిన Pirelli Diablo Supercorsa SP V4 టైర్లను ఉపయోగించారు. ఇవి బైక్ ట్రాక్-ఫోకస్డ్ పనితీరును సూచిస్తున్నాయి.
Norton Manx Rను Standard, Apex, Signature, First Edition అనే నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. వీటిలో Apex వేరియంట్‌కు సెమీ-యాక్టివ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ Marzocchi సస్పెన్షన్, OZ Racing ఫోర్జ్డ్ వీల్స్ ప్రత్యేకతగా ఉన్నాయి.
Signature, First Editionవేరియంట్లలో కార్బన్ ఫైబర్ బాడీవర్క్, Robotox Bullet Pro కార్బన్ వీల్స్ అందించారు.
Standard వేరియంట్ కర్బ్ వెయిట్ 210 కిలోలు కాగా.. టైటానియం భాగాలను ఉపయోగించిన First Edition బరువు 201 కిలోలుగా ఉంది.