LOADING...
హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే 
హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే

హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే 

వ్రాసిన వారు Stalin
Aug 13, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ అతిపెద్ద బైక్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'హీరో' కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. కరిజ్మా XMR 210 మోడల్‌ను త్వరలో విడుదల చేసేందుకు 'హీరో' సంస్థ సిద్ధమవుతోంది. కరిజ్మా XMR 210 బైక్ సంబంధించిన మోడల్‌ను ఆదివారం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇన్‌స్టా వేదికగా పరిచయం చేశారు. 2003 నుంచి కరిజ్మాకు బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్ ఉన్నారు. ఆగష్టు 29న కరిజ్మా XMR 210 బైక్ కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ మోడల్‌ను కూడా గత బైక్‌ల మాదిరిగానే సబ్-250cc సామర్థ్యంతో తయారు చేశారు. భారతదేశంలో ఈ మోడల్ బైక్ ప్రారంభ ధరను రూ.1.8 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

బైక్

కరిజ్మా XMR 210 మోడల్ ఫీచర్లు ఇవే

కరిజ్మా XMR 210 మోడల్ బైక్ డిజైన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బాడీ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, టెయిల్ సెక్షన్, పెద్ద హ్యాండిల్ బార్, హెడ్‌లైట్, టెయిల్ లైట్, టర్న్ ఇండికేటర్‌ల కోసం అన్ని-LED పరికరాలను ఇందులో పొందుపర్చారు. ఈ బైక్‌లో ఇంధన ట్యాంక్, పొడవైన విండ్‌షీల్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అలాగే పూర్తి-డిజిటల్ కన్సోల్, డిజైనర్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ బైక్ సొంతం. ఇది 210సీసీ సామర్థ్యంతో విడుదల అవుతోంది. సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఈ బై‌క్‌కు ఉంటుంది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

హృతిక్ రోషన్ చేసిన పోస్ట్