MV Agusta Brutale: కేవలం 130 యూనిట్లు మాత్రమే.. ఎంజీ ఆగస్టా కొత్త బ్రూటాలే 1000 ABT ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటాలియన్ ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ MV అగస్టా తన కొత్త లిమిటెడ్ ఎడిషన్ సూపర్‌బైక్ 'బ్రూటాలే 1000 ABT'ను అధికారికంగా ఆవిష్కరించింది. జర్మనీకి చెందిన ప్రముఖ ట్యూనింగ్ స్పెషలిస్ట్ ABT స్పోర్ట్స్‌లైన్ భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక బైక్‌ను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 130 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్న ఈ మోడల్, ABT స్పోర్ట్స్‌లైన్ 130వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. ఇటలీలో ఈ బైక్ ధర €40,990గా నిర్ణయించగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.46 లక్షలకు సమానం.
వివరాలు
డిజైన్, ఇంజిన్ స్పెసిఫికేషన్లు
కొత్త బ్రుటాలే 1000 ఏబీటీ, ఎంవీ అగస్టా ఫ్లాగ్‌షిప్ నేకెడ్ బైక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. బైక్‌కు ప్రత్యేకమైన నెరో కార్బోనియో మెటాలిజాటో, రోస్సో ఫుయోకో పెయింట్ స్కీమ్‌ను అందించారు. అలాగే ఇటాలియన్, జర్మన్ జెండాల గ్రాఫిక్స్‌తో స్పోర్టీ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బైక్‌లో యూరో 5+ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే 998cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 13,500rpm వద్ద 201 హార్స్‌పవర్ శక్తిని, 11,000rpm వద్ద 116Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
రేసింగ్ కిట్‌తో మరింత పవర్
బ్రూటాలే 1000 ABT కోసం ప్రత్యేక రేసింగ్ కిట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో Arrow టైటానియం స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్‌తో పాటు ప్రత్యేక ఈసీయూ మ్యాపింగ్ ఉంటుంది. ఈ కిట్‌ను అమర్చిన తర్వాత బైక్ పవర్ 14,000rpm వద్ద 208hp వరకు పెరుగుతుంది. సస్పెన్షన్ బాధ్యతలను ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేసుకునే ఓహ్లిన్స్ హార్డ్‌వేర్ నిర్వహిస్తుంది. కంప్రెషన్, రీబౌండ్ డ్యాంపింగ్‌లపై ఎలక్ట్రానిక్ నియంత్రణ సదుపాయం ఇందులో ఉంది.
వివరాలు
బ్రేకింగ్, ఫీచర్లు ఇవే
బ్రేకింగ్ కోసం ముందు భాగంలో బ్రెంబో స్టైల్మా కాలిపర్లతో కూడిన డ్యూయల్ 320mm డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో 220mm సింగిల్ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. బైక్ బరువును తగ్గించేందుకు పలు కార్బన్ ఫైబర్ భాగాలను ఉపయోగించారు. ఫోర్జ్డ్ వీల్స్‌తో పాటు మొత్తం 19 కార్బన్ ఫైబర్ కాంపోనెంట్లు ఇందులో ఉన్నాయి. వీటిలో ఫ్రంట్ మడ్‌గార్డ్ సపోర్ట్స్, ఎయిర్‌బాక్స్ కవర్, ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ స్పాయిలర్, రియర్ వీల్ కవర్, ఇంజిన్ కవర్లు ఉన్నాయి.
వివరాలు
ప్రతి బైక్‌కు ప్రత్యేక నంబరింగ్
ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ప్రతి బ్రూటాలే 1000 ABT బైక్‌కు ప్రత్యేక నంబరింగ్ ఉంటుంది. అదనంగా ఓనర్లకు ప్రత్యేక ప్యాకేజ్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో యారో టైటానియం ఎగ్జాస్ట్, ఈసీయూ మ్యాప్, పెయింటెడ్ కార్బన్ ఫైబర్ పిలియన్ సీట్ కవర్, స్వింగ్ ఆర్మ్ పివట్ అడ్జస్ట్‌మెంట్ ప్లేట్లు, ప్రత్యేక బైక్ కవర్, సర్టిఫికేట్ ఆఫ్ ఆథెంటిసిటీ వంటి అంశాలు ఉంటాయి.