LOADING...
Porsche Cayenne: ఘోర ప్రమాదంలో పోర్షే కయేన్ ధ్వంసం.. డ్రైవర్ సురక్షితం
ఘోర ప్రమాదంలో పోర్షే కయేన్ ధ్వంసం.. డ్రైవర్ సురక్షితం

Porsche Cayenne: ఘోర ప్రమాదంలో పోర్షే కయేన్ ధ్వంసం.. డ్రైవర్ సురక్షితం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్జియాలో జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది. పోర్షే కయేన్(Porsche Cayenne)కారు పూర్తిగా రెండుగా చీలిపోయింది. ముందు భాగం, వెనుక భాగం పూర్తిగా విడిపోయినా,డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడటం ఆశ్చర్యం. ఘటన స్థలంలోని ఫోటోలు చూస్తే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది.ఈ ప్రమాదంలో ఉన్న కారు కార్మైన్ రెడ్ కలర్‌లో ఉన్న పోర్షే కయేన్ కూపే మోడల్‌గా గుర్తించారు. ఇది ఎస్ వేరియంట్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.కారులో కార్బన్-సెరామిక్ బ్రేక్స్,స్పోర్ట్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ఇది హై ఎండ్ మోడల్ అని తెలుస్తోంది. ప్రమాదం సమయంలో కారు ముందుభాగం,వెనుక భాగం కొంత దూరంలో పడిపోయి,కొన్ని వైర్లు మాత్రమే కలిపి ఉంచిన పరిస్థితి కనిపించింది.

వివరాలు 

ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు

ప్రమాదం తీవ్రత కారణంగా సీటు పూర్తిగా బయటికి వచ్చి రోడ్డుపై పడిపోయింది. వెనుక భాగంలో ఉన్న కార్గో స్పేస్, బ్యాక్ సీట్లు డ్రైవర్ కేబిన్‌కు వేరుగా మిగిలిపోయాయి. అయితే డ్రైవర్ ఉన్న భాగం మాత్రం కొంతవరకు సేఫ్‌గా ఉండటం గమనార్హం. పోలీసుల ప్రకారం, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. అధిక వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో కారు ఎంత స్పీడ్‌లో ఉందో ఇంకా స్పష్టత రాలేదు.

వివరాలు 

యూరో NCAP నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్

ఇంత భారీగా ధ్వంసమైనా కూడా పోర్షే కయేన్ డ్రైవర్‌ను రక్షించడం,ఈ కారు సేఫ్టీ స్టాండర్డ్స్ ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూపిస్తోంది. ఈ మోడల్‌కు యూరో NCAP నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. భారత్‌లో కూడా ఈ కారు అమ్మకాల్లో ఉండగా,కూపే వేరియంట్ ప్రారంభ ధర సుమారు రూ.1.44 కోట్లు (ఎక్స్‌షోరూమ్).

Advertisement