Loading...
Porsche Electric 718 Boxster: 2027లో పోర్షే కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 3 సెకన్లలో 100 కి.మీ. వేగం
2027లో పోర్షే కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 3 సెకన్లలో 100 కి.మీ. వేగం

Porsche Electric 718 Boxster: 2027లో పోర్షే కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 3 సెకన్లలో 100 కి.మీ. వేగం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పోర్ట్స్‌ కార్లలో వేగానికి పెట్టింది పేరైన పోర్షే.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విభాగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ 718 బాక్స్‌స్టర్‌ను తీసుకొస్తోంది. 2027 తొలి త్రైమాసికంలో ఈ కారును ప్రపంచానికి పరిచయం చేయనుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. నిలిచిన స్థితి నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 3 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది. ఇప్పటివరకు పోర్షే తయారు చేసిన బాక్స్‌స్టర్‌ మోడళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన కారుగా నిలవనుంది. ఆటో మొబైల్‌ రంగంలో ఈ కారు సరికొత్త అధ్యయంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Details

గేర్‌ మార్చిన అనుభూతినిచ్చే E-Shift

ఎలక్ట్రిక్‌ కార్లలో సాధారణంగా గేర్‌ మార్పుల అనుభూతి ఉండదు. అయితే స్పోర్ట్స్‌ కార్ల అభిమానులను దృష్టిలో పెట్టుకుని పోర్షే కొత్త E-Shift వ్యవస్థను అభివృద్ధి చేసింది.

సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ ద్వారా 7-స్పీడ్‌ PDK డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ తరహా అనుభూతి కలుగుతుంది.

అంటే పెట్రోల్‌ ఇంజిన్‌ శబ్దం, ఇంధన వినియోగం లేకపోయినా.. స్పోర్టీ డ్రైవింగ్‌లో ఉండే గేర్‌ మార్పుల అనుభవాన్ని డ్రైవర్‌ ఆస్వాదించవచ్చు.

Details

సీట్ల వెనుక బ్యాటరీ.. మిడ్‌ ఇంజిన్‌ తరహా డిజైన్

ఈ ఎలక్ట్రిక్‌ బాక్స్‌స్టర్‌లో బ్యాటరీని సీట్లకు వెనుక భాగంలో అమర్చారు. సంప్రదాయ స్పోర్ట్స్‌ కార్లలో కనిపించే మిడ్‌ ఇంజిన్‌ తరహా బరువు సమతుల్యతను సాధించడం దీని ఉద్దేశం.

దీనివల్ల కారు నడిపేటప్పుడు మెరుగైన నియంత్రణ, స్థిరత్వం లభిస్తాయని పోర్షే చెబుతోంది.

చాసిస్‌లో చేసిన మార్పులతో పాటు ఆప్షనల్‌ రియర్‌ యాక్సిల్‌ స్టీరింగ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ మలుపుల్లో కారు మరింత చురుగ్గా స్పందించేందుకు సహాయపడుతుంది.

ADVERTISEMENT

Details

25 లక్షల కిలోమీటర్లకు పైగా పరీక్షలు

కొత్త 718 బాక్స్‌స్టర్‌ను రోడ్డుపైకి తీసుకురావడానికి ముందు పోర్షే విస్తృతంగా పరీక్షించింది.

దాదాపు 25 లక్షల మైళ్లకు (40 లక్షల కిలోమీటర్లకు పైగా) ఈ కారును వివిధ పరిస్థితుల్లో నడిపి పరిశీలించినట్లు వెల్లడించింది.

ఇంతటి పరీక్షల తర్వాత కూడా కారు బరువును ప్రస్తుత 911 క్యాబ్రియోలెట్‌కు దగ్గరగా ఉంచే ప్రయత్నం చేసింది.

వేగం, డ్రైవింగ్‌ అనుభూతి, సమతుల్యత.. ఈ మూడింటినీ ఎలక్ట్రిక్‌ కారులో అందించడమే పోర్షే లక్ష్యంగా కనిపిస్తోంది. 2027లో ఆవిష్కరణ తర్వాత ఈ మోడల్‌పై మరిన్ని సాంకేతిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT