LOADING...
Tyre inflator : రూ.2,999కే పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్.. రైడర్లకు బెస్ట్ ఎమర్జెన్సీ గ్యాడ్జెట్
రూ.2,999కే పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్.. రైడర్లకు బెస్ట్ ఎమర్జెన్సీ గ్యాడ్జెట్

Tyre inflator : రూ.2,999కే పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్.. రైడర్లకు బెస్ట్ ఎమర్జెన్సీ గ్యాడ్జెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టూ వీలర్ రైడర్లకు ప్రయాణాల సమయంలో తరచుగా ఎదురయ్యే సమస్యల్లో టైర్లలో గాలి తగ్గిపోవడం ఒకటి. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ లేదా రాత్రి వేళల్లో ఈ సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ భారత మార్కెట్లోకి కొత్త పోర్టబుల్ వైర్‌లెస్ టైర్ ఇన్‌ఫ్లేటర్ 'వాయు నానో'ను తీసుకొచ్చింది. బైక్‌లు, స్కూటర్లు, సైకిళ్లు ఉపయోగించే వారికి అత్యవసర సమయాల్లో ఇది ఎంతో సహాయకారిగా ఉండనుంది. ఈ పోర్టబుల్ ఇన్‌ఫ్లేటర్ అసలు ధర రూ.4,999 కాగా, ప్రస్తుతం లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,999కే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది విక్రయానికి ఉంది.

వివరాలు

5 నిమిషాల్లో టైర్ ఫుల్ ఎయిర్

అంతేకాదు, దీనిపై 12 నెలల వారంటీ కూడా లభిస్తోంది. చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ 'వాయు నానో' గరిష్టంగా 120 PSI వరకు ప్రెజర్ అవుట్‌పుట్ ఇవ్వగలదు. సాధారణ బైక్ టైర్‌లో 0 నుంచి 35 PSI వరకు కేవలం ఐదు నిమిషాల్లోనే గాలిని నింపగలదని కంపెనీ తెలిపింది. బైక్ టైర్లకు 45 PSI వరకు, సైకిల్ టైర్లకు 35 PSI వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లేతో స్మార్ట్ కంట్రోల్ ఈడివైజ్‌లో డిజిటల్ స్క్రీన్‌ను అమర్చారు. దీని ద్వారా టైర్లలోని గాలి ఒత్తిడిని PSI, BAR యూనిట్లలో స్పష్టంగా చూడవచ్చు. యూజర్లు అవసరాన్ని బట్టి ప్రీసెట్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. అలాగే మాన్యువల్‌గా కూడా ప్రెజర్ లెవెల్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంది.

వివరాలు

వైర్‌లెస్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

'వాయు నానో'లో రెండు 600mAh రీఛార్జబుల్ బ్యాటరీలను అందించారు. టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. పూర్తిగా వైర్‌లెస్ డిజైన్ కావడంతో ప్రయాణాల్లో బాహ్య పవర్ సోర్స్ అవసరం లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఆటో కట్-ఆఫ్ సేఫ్టీ ఫీచర్ టైర్‌లో గాలి నింపేటప్పుడు యూజర్ ముందుగా సెట్ చేసిన ప్రెజర్ లెవెల్ చేరుకున్న వెంటనే ఈ ఇన్‌ఫ్లేటర్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీంతో టైర్లలో అధిక గాలి నిండి పేలిపోయే ప్రమాదం ఉండదు.

Advertisement

వివరాలు

ట్రావెల్ ఫ్రెండ్లీ డిజైన్

పోర్ట్రానిక్స్ వాయు నానోను తక్కువ బరువుతో, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో రూపొందించారు. చిన్న సైజ్ కారణంగా దీన్ని బ్యాక్‌ప్యాక్‌లు లేదా స్కూటర్ డిక్కీల్లో సులభంగా ఉంచుకోవచ్చు. గాలి నింపేందుకు 7.5 సెం.మీ ఎయిర్ హోస్‌ను కూడా అందించారు. రాత్రి వేళల్లో కూడా ఉపయోగకరం రాత్రి సమయంలో రోడ్డుపై బైక్ టైర్‌లో గాలి తగ్గినా, పంక్చర్ సమస్య వచ్చినా ఉపయోగపడేలా ఇందులో ఇంటిగ్రేటెడ్ LED లైట్‌ను అమర్చారు.

Advertisement

వివరాలు

స్పోర్ట్స్ బాల్స్‌కూ సపోర్ట్

బైక్, సైకిల్ టైర్లతో పాటు ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి స్పోర్ట్స్ బాల్స్‌తో పాటు ఇతర ఎయిర్ యాక్సెసరీస్‌లో గాలి నింపేందుకు అవసరమైన మల్టిపుల్ నాజిల్ అటాచ్‌మెంట్లను కూడా బాక్స్‌లో ఉచితంగా అందిస్తున్నారు. భారత్‌లో టూ వీలర్ రైడింగ్, బైక్ టూరింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి పోర్టబుల్ ఎమర్జెన్సీ టూల్స్ ప్రతి రైడర్ వద్ద ఉండటం ప్రయాణాల్లో మరింత భద్రత, సౌకర్యాన్ని అందించనుంది.

Advertisement