LOADING...
Mahindra XEV 9S: 20 లక్షల లోపు ధర.. 679 కి.మీ రేంజ్‌.. బాలీవుడ్‌ స్టార్ల మనసు దోచిన ఈవీ!
20 లక్షల లోపు ధర.. 679 కి.మీ రేంజ్‌.. బాలీవుడ్‌ స్టార్ల మనసు దోచిన ఈవీ!

Mahindra XEV 9S: 20 లక్షల లోపు ధర.. 679 కి.మీ రేంజ్‌.. బాలీవుడ్‌ స్టార్ల మనసు దోచిన ఈవీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహీంద్రా తయారు చేస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌ (Mahindra XEV 9S)' బాలీవుడ్ ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ కారును సొంతం చేసుకోగా, తాజాగా ప్రముఖ నటుడు కబీర్ బేడీ కూడా ఈ జాబితాలో చేరారు. తన గ్యారేజ్‌లోకి కొత్త కారు చేరిన ఆనందాన్ని కబీర్ బేడీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

వివరాలు

వీడియో షేర్ చేసిన కబీర్ బేడీ

తన కొత్త 7-సీటర్ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌కు సాంప్రదాయబద్ధంగా పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఆయన 'డెజర్ట్ మిస్ట్' (Desert Mist) కలర్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు రూబీ వెల్వెట్, నెబ్యులా బ్లూ, స్టెల్త్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.19.95 లక్షలు (ఎక్స్‌-షోరూమ్)గా నిర్ణయించారు.

వివరాలు

బ్యాటరీ, పనితీరు ఎలా ఉంది?

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌ మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి 59kWh, 70kWh, 79kWh. ఈ మూడు వేరియంట్లు కూడా డీసీ(DC)ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నప్పటికీ, ఛార్జింగ్ పవర్ సామర్థ్యం మాత్రం వేరువేరుగా ఉంటుంది. 59kWh బ్యాటరీ వేరియంట్ గరిష్టంగా 231 హెచ్‌పీ (HP) పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బేస్ వేరియంట్‌కు ARAI సర్టిఫైడ్ 521 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) సిస్టమ్‌తో వస్తుంది. ఇక టాప్-ఎండ్ 79kWh బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 286హెచ్‌పీ పవర్ అందిస్తుంది. ఈ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 679 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది కూడా రియర్ వీల్ డ్రైవ్ సెటప్‌తోనే అందుబాటులో ఉంది.

Advertisement

వివరాలు

సెలబ్రిటీల హాట్ ఫేవరెట్

మహీంద్రా విక్రయాల్లో అత్యధిక ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్స్ఈవీ 9ఎస్‌ ఒకటిగా నిలుస్తోంది. కబీర్ బేడీకి ముందే ప్రముఖ పంజాబీ గాయకుడు 'దలేర్ మెహందీ' ఈ కారును కొనుగోలు చేశారు. విశాలమైన 7-సీటర్ లేఅవుట్, అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్, నమ్మకమైన డ్రైవింగ్ రేంజ్ వంటి అంశాలు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అందుకే ఇది సామాన్య వినియోగదారులతో పాటు సినీ, సంగీత రంగ ప్రముఖుల హాట్ ఫేవరెట్‌గా మారుతోంది.

Advertisement