Loading...
Range Rover: రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ లాంచ్.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్.. ప్రత్యేకతలు ఇవే!
రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ లాంచ్.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్.. ప్రత్యేకతలు ఇవే!

Range Rover: రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ లాంచ్.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్.. ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ రేంజ్ రోవర్ తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. బ్రాండ్ ఎలక్ట్రిఫికేషన్ వ్యూహంలో ఇది కీలక ముందడుగుగా నిలిచింది. రేంజ్ రోవర్‌కు ప్రత్యేకమైన లగ్జరీ, డిజైన్‌తో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఇందులో అందించారు. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. స్టాండర్డ్ వీల్‌బేస్‌లో ఆటోబయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లతో పాటు లాంగ్ వీల్‌బేస్‌లో ఎస్‌వీ, ఎస్‌వీ అల్ట్రా, ఎస్‌వీ బ్లాక్ మోడళ్లను బుక్ చేసుకోవచ్చు.

వివరాలు

రేంజ్, బ్యాటరీ, మోటార్ పవర్..

రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్‌లో 118.5 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇందులో 344 ప్రిస్మాటిక్ సెల్స్ ఉన్నాయి.

800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను కూడా అందించారు. రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 542 హెచ్‌పీ పవర్, 850 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ల్యాండ్ రోవర్ చెబుతోంది.

రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్‌లో 350kW వరకు ఫాస్ట్ డీసీ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంటుంది.

అనుకూలమైన ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 22 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

వివరాలు

ఆఫ్‌రోడ్ సామర్థ్యానికి ప్రాధాన్యం..

వాహనం గరిష్ఠ ఛార్జింగ్ రేటుతో ఛార్జ్ చేసినప్పుడు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 125 మైళ్ల వరకు డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది EPA అంచనాల ఆధారంగా పేర్కొన్న గణాంకం. రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్‌లో కొత్త ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

ఇది కేవలం 50 మిల్లీసెకన్లలో స్పందించగలదని ల్యాండ్ రోవర్ చెబుతోంది.

విభిన్న రకాల రోడ్లు, భూభాగాల్లో వాహనానికి మెరుగైన గ్రిప్ అందించడంతో పాటు రేంజ్ రోవర్‌కు ఉన్న ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని కొనసాగించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

ఎలక్ట్రిక్ రేంజ్ రోవర్ 35 అంగుళాల లోతు వరకు నీటిలో ప్రయాణించగలదు.

రేంజ్ రోవర్ వాహనాలకు ఉన్న సంప్రదాయ ఆల్-టెర్రైన్ సామర్థ్యాలు ఇందులోనూ కొనసాగుతాయి.

ADVERTISEMENT

వివరాలు

సింగిల్ పెడల్ డ్రైవింగ్..

రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్‌లో సింగిల్ పెడల్ డ్రైవింగ్ మోడ్ కూడా ఉంటుంది.

దీని ద్వారా డ్రైవర్ యాక్సిలరేటర్ పెడల్‌ను ఉపయోగిస్తూనే వాహనం వేగాన్ని పెంచడం, తగ్గించడం చేయవచ్చు.

అదే సమయంలో బ్యాటరీలోకి తిరిగి శక్తిని పంపే ఎనర్జీ రిక్యుపరేషన్‌కు కూడా ఇది సహాయపడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 45 డిగ్రీల వరకు వాలుగా ఉన్న రోడ్లపై కూడా ఎక్కగలదని ల్యాండ్ రోవర్ తెలిపింది.

ఎలక్ట్రిక్ మోడల్‌లో గురుత్వ కేంద్రం తక్కువగా ఉండటం వల్ల స్థిరత్వం మెరుగుపడుతుంది.

అలాగే ట్విన్-చాంబర్ ఎయిర్ సస్పెన్షన్‌ను అందించారు. ఇది రైడ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్‌ను మెరుగుపరిచేలా పనిచేస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

38 సార్లు భూమి చుట్టూ తిరిగినంత టెస్టింగ్..

రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ అభివృద్ధి కోసం తమ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన టెస్టింగ్ ప్రోగ్రామ్‌లలో ఒకదాన్ని నిర్వహించినట్లు ల్యాండ్ రోవర్ తెలిపింది.

ఫిజికల్ టెస్టింగ్‌లో భాగంగా ఈ ఎస్‌యూవీ మొత్తం ప్రయాణించిన దూరం భూమిని 38 సార్లు చుట్టి వచ్చిన దూరానికి సమానమని కంపెనీ పేర్కొంది.

అంతేకాకుండా ఇంజినీర్లు 2,50,000 గంటలకు పైగా వర్చువల్ వాలిడేషన్ నిర్వహించారు.

ఇప్పటివరకు ఏ రేంజ్ రోవర్ మోడల్‌కు నిర్వహించిన వర్చువల్ వాలిడేషన్‌లో ఇదే అత్యధికమని ల్యాండ్ రోవర్ తెలిపింది.

ADVERTISEMENT