ReiseMoto: భారత్ మార్కెట్‌లో MT హెల్మెట్ల విస్తరణ.. రైజ్‌మోటో కీలక అడుగు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో టూ-వీలర్ సేఫ్టీ గేర్ రంగంలో రైజ్‌మోటో తన స్థాయిని మరింత బలపర్చుకుంది. 2026 నుంచి దేశవ్యాప్తంగా MT హెల్మెట్లకు అధికారిక డిస్ట్రిబ్యూటర్‌గా రైజ్‌మోటో నియమితమైంది. ఈ భాగస్వామ్యంతో MT హెల్మెట్ల విస్తరణకు కొత్త ఊపిరి లభించనుండగా, దేశవ్యాప్తంగా తన రిటైల్, డీలర్ నెట్‌వర్క్ ద్వారా సరఫరా, అందుబాటు, బ్రాండ్ అభివృద్ధి బాధ్యతలను రైజ్‌మోటో చేపట్టనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఉత్పత్తుల్లో MT స్టింగర్ 2 హెల్మెట్ ఒకటి. ఈ సెగ్మెంట్‌లో ప్రీమియం ఆఫరింగ్‌గా నిలిచే ఈ హెల్మెట్‌కు SHARP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు తాజా ECE 22.06 సర్టిఫికేషన్ లభించడం ప్రత్యేకత. రైడర్ భద్రతపై ప్రత్యేక దృష్టితో రూపొందించబడిన హెల్మెట్‌గా ఇది గుర్తింపు పొందుతోంది.
వివరాలు
స్టింగర్2లో అదిరిపోయే ఫీచర్లు..
ECE 22.06 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్టింగర్ 2లో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో MT-QVSS విజర్ సిస్టమ్ ద్వారా విజర్‌ను సులభంగా మార్చుకునే సౌకర్యం ఉంది. అలాగే యూనివర్సల్ UCS కమ్యూనికేషన్ సిస్టమ్‌కు సపోర్ట్ ఉండటంతో ఇంటర్‌కామ్ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది. భారత్‌లో మహాన్సారియా గ్రూప్ మద్దతుతో రైజ్‌మోటో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా MT హెల్మెట్లకు విస్తృతంగా అందుబాటు పెరగడమే కాకుండా, ఆఫ్టర్ సేల్స్ సేవలు కూడా మెరుగుపడనున్నాయి. ప్రపంచంలో అత్యంత కఠినమైన సేఫ్టీ ప్రమాణాల్లో ఒకటైన ECE 22.06 సర్టిఫికేషన్‌తో పాటు SHARP 5-స్టార్ రేటింగ్ పొందడం వల్ల ఈ హెల్మెట్ తన సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది.
వివరాలు
ధర ఎంతంటే..
ఈ హెల్మెట్‌లో MT-MDTC (మైక్రోమెట్రిక్ డబుల్ టీత్ క్లోజర్) సిస్టమ్ ఉండటంతో సురక్షితంగా ధరించవచ్చు. అలాగే టూల్స్ అవసరం లేకుండా విజర్ మార్చుకునే MT-QVSS సిస్టమ్ అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఇంటర్‌కామ్ సదుపాయం కోసం యూనివర్సల్ UCS కమ్యూనికేషన్ సిస్టమ్‌కు సపోర్ట్ ఉంది. అలాగే హెల్మెట్‌లోని ఇంటీరియర్ భాగాలు హైపోఅలెర్జెనిక్, పూర్తిగా తీసి శుభ్రం చేసుకునే విధంగా ఉండటంతో దీర్ఘకాలం ఉపయోగంలో పరిశుభ్రత, సౌకర్యం కల్పిస్తాయి. ధర విషయానికి వస్తే, MT స్టింగర్ 2 హెల్మెట్ సాలిడ్ కలర్ వేరియంట్లు రూ. 6,699 నుంచి ప్రారంభమవుతాయి. గ్రాఫిక్ డిజైన్ వేరియంట్ల ధరలు రూ. 7,099 నుంచి మొదలవుతాయి.