Renault Bigster: ఇండియాలో మరో ఫ్యామిలీ కార్...హైబ్రిడ్ వర్షెన్‌తో రెనాల్ట్ బిగ్‌స్టర్
ఈ వార్తాకథనం ఏంటి
కుటుంబమంతా కలిసి ప్రయాణించేందుకు పెద్ద కారు కావాలనుకునే వారికి రెనాల్ట్ కొత్త ఎంపికను సిద్ధం చేస్తోంది. భారత మార్కెట్లోకి 2027 నాటికి బిగ్‌స్టర్ పేరుతో 7 సీటర్ ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే డస్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్.. మరింత విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన ఇంధన సామర్థ్యంతో ఈ కొత్త మోడల్‌ను తీసుకురావాలని భావిస్తోంది.
Details
డస్టర్ కంటే పెద్దగా.. ప్రత్యేకమైన డిజైన్‌తో
గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ ఎస్‌యూవీ డస్టర్‌కు పెద్ద వెర్షన్‌గా ఉండనుంది.
మూడు వరుసల సీటింగ్‌కు అనుగుణంగా పొడవు, వీల్‌బేస్‌ను పెంచనున్నారు. వై-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, రగ్గడ్ ఫ్రంట్ బంపర్, బాక్సీ బాడీ డిజైన్, వీ-ఆకారపు టెయిల్ ల్యాంప్స్ దీని ప్రత్యేకతలుగా నిలవనున్నాయి.
17 లేదా 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్‌తో ఎస్‌యూవీ లుక్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.
Details
హైబ్రిడ్ ఇంజిన్.. మైలేజీపై ప్రత్యేక దృష్టి
బిగ్‌స్టర్‌లో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh బ్యాటరీ కలిపి పనిచేస్తాయి.
ఈ సెటప్ 160 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. మరోవైపు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండనుంది.
ఇది 160 బీహెచ్‌పీ పవర్, 270 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి.
Details
ఫీచర్లు, భద్రతలోనూ ప్రీమియం టచ్
క్యాబిన్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి.
పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా ఆశించవచ్చు.
360 డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో చోటు చేసుకోనున్నాయి.
2027 ప్రథమార్ధంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్న బిగ్‌స్టర్ ధర రూ.14 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
మార్కెట్లోకి వస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్‌లకు పోటీ ఇవ్వనుంది.
అయితే భారత వెర్షన్‌లో ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, ధరపై రెనాల్ట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.