LOADING...
2026 Renault Kwid : భారీ అప్‌డేట్స్‌తో వస్తోన్న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ ఎప్పుడు?
భారీ అప్‌డేట్స్‌తో వస్తోన్న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ ఎప్పుడు?

2026 Renault Kwid : భారీ అప్‌డేట్స్‌తో వస్తోన్న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ ఎప్పుడు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ బడ్జెట్ కార్ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రెనాల్ట్ క్విడ్ ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ కిగర్ మోడళ్లకు అప్‌డేట్స్ ఇచ్చిన ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్.. ఇప్పుడు తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌ను కూడా ఆధునీకరించేందుకు సిద్ధమైంది. 2026 మోడల్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ తాజాగా రోడ్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త వెర్షన్‌లో ఏ మార్పులు రానున్నాయో చూద్దాం.

Details

2026 రెనాల్ట్ క్విడ్ - ఎక్స్‌టీరియర్: మరింత స్టైలిష్ లుక్

రోడ్ టెస్టింగ్‌లో గమనించిన వివరాల ప్రకారం, బాహ్య రూపంలో పలు మార్పులు ఉండనున్నాయి. ముందు భాగం రీడిజైన్ చేసిన రేడియేటర్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో ముందుభాగం పూర్తిగా మారనుంది. బంపర్ డిజైన్ కూడా కొత్త స్టైలింగ్‌తో ఆకర్షణీయంగా కనిపించనుంది. లోగో కంపెనీ ప్రీమియం మోడళ్ల తరహాలో మెరిసే కొత్త బ్రాండ్ లోగోను ఇందులో చూడొచ్చు. సైడ్ & రేర్ కొత్త డిజైన్ వీల్స్, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు అందించనున్నారు. అదనంగా కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. 2026 రెనాల్ట్ క్విడ్ ఇంటీరియర్: టెక్నాలజీకి ప్రాధాన్యం

Details

టచ్‌స్క్రీన్

లోపలి భాగంలో ప్రీమియం అనుభూతి కలిగించేలా పలు అప్‌గ్రేడ్స్ చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న దానికంటే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఇది లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ క్లస్టర్ డ్రైవర్ కోసం సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించనున్నారు. క్యాబిన్ లేఅవుట్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, కొత్త ఫీచర్లు కారుకు అదనపు ఆకర్షణను జోడించనున్నాయి. 2026 రెనాల్ట్ క్విడ్-ఇంజిన్ సామర్థ్యం: అదే నమ్మకమైన పవర్‌ట్రెయిన్ బాహ్య, అంతర్గత మార్పులు ఉన్నప్పటికీ మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇంజిన్ ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. పవర్ & టార్క్ గరిష్టంగా 65 బీహెచ్‌పీ పవర్, 91ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

Details

ధర & మార్కెట్ పోటీ

ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్‌లోకి రానున్న 2026 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఈ హ్యాచ్‌బ్యాక్, అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తే విక్రయాలు మరింత పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

Advertisement

Details

ప్రశ్నలు - సమాధానాలు

ప్రశ్న: కొత్త రెనాల్ట్ క్విడ్‌లో ఇంజిన్ మార్పులు ఉన్నాయా? సమాధానం: మెకానికల్‌గా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 1.0-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 65 బీహెచ్‌పీ పవర్, 91 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రశ్న: ఇంటీరియర్‌లో ప్రధాన అప్‌డేట్స్ ఏమిటి? సమాధానం: పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన మార్పులు. ప్రశ్న: మార్కెట్లో ఈ కారు ఏ మోడళ్లకు పోటీ ఇస్తుంది? సమాధానం: ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఆల్టో కే10, సెలెరియో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement