Loading...
Royal Enfield Classic 350: బైక్ ప్రియులకు షాక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర పెరిగింది.. కొత్త ధరలు ఇవే..
కొత్త ధరలు ఇవే..

Royal Enfield Classic 350: బైక్ ప్రియులకు షాక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర పెరిగింది.. కొత్త ధరలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన Classic 350 బైక్ ధరలను తాజాగా పెంచింది. ఎలాంటి ప్రకటన లేకుండానే కంపెనీ కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. Classic 350లోని మొత్తం తొమ్మిది రంగుల వేరియంట్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. ఎంట్రీ లెవల్ Redditch Red నుంచి ప్రీమియం Emerald, Signature White వేరియంట్ల వరకు ధరలు పెరిగాయి. గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది. అయితే బైక్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. Classic 350లో ఇదివరకటిలాగే 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 hp శక్తి, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు 

ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు

ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 2026లో చేసిన అప్‌డేట్‌లో డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్లకు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్,USB Type-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు వచ్చాయి.

ప్రస్తుతం కూడా ఇవి కొనసాగుతున్నాయి. అయితే బేస్ వేరియంట్ అయిన సింగిల్ ఛానల్ Redditch Redలో ఈ రెండు ఫీచర్లు అందుబాటులో లేవు.

Classic 350 ధరలను పరిశీలిస్తే..బేస్ Redditch Red వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.89లక్షలకు చేరింది.

Madras Red ధర రూ.1.96లక్షలుగా ఉంది. Medallion Bronze వేరియంట్ రూ.2.01లక్షలు పలుకుతోంది.

Commando Sand, Gorkha Edition వేరియంట్ల ధరలు రూ.2.12లక్షలుగా ఉన్నాయి.

Gun Grey,Stealth Black వేరియంట్ల ధర రూ.2.21లక్షలకు చేరింది.

వివరాలు 

Emerald, Signature White వేరియంట్లపై రూ.2,000 పెంపు

ఇక టాప్ స్పెక్ Emerald,Signature White వేరియంట్ల ధరలు రూ.2.26లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

మరోవైపు ఆగస్టు మధ్యలో మార్కెట్లోకి వచ్చిన Gorkha Editionపై సుమారు రూ.1,000 ధర పెరిగింది.

Emerald, Signature White వేరియంట్లపై మాత్రం పూర్తి రూ.2,000 పెంపు నమోదైంది.

దీంతో Classic 350 కొనుగోలు చేయాలనుకునే వారికి గతంతో పోలిస్తే మరింత ఖర్చు కానుంది.

Classic 350 ధరల పెంపు సమయంలో ఈ బైక్‌కు పోటీగా కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

Royal Enfield Classic 350కి ప్రధాన ప్రత్యర్థిగా Honda CB350

ట్రయంఫ్ ఇటీవల 350cc ఇంజిన్‌తో Bonneville T4 బైక్‌ను రూ.2.55 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.

అదే సంస్థ Bonneville T40 మోడల్‌ను రూ.2.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చింది.

వీటితో పాటు Honda CB350 కూడా Royal Enfield Classic 350కి ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది.

ADVERTISEMENT