Royal Enfield Himalayan 750: హిమాలయన్ 750తో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అడ్వెంచర్ బైక్‌ల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అడుగు ముందుకేసింది. కొత్త హిమాలయన్ 750తో కంపెనీ తన అడ్వెంచర్ టూరింగ్ శ్రేణిలోనే అతిపెద్ద మార్పును తీసుకొచ్చింది. ఇటలీలోని సిసిలీ రోడ్లపై ఈ బైక్‌ను తొలిసారి రైడ్ చేసిన అనుభవం చూస్తే.. ఇది పాత హిమాలయన్‌కు కేవలం పెద్ద ఇంజిన్ జోడించిన మోడల్ కాదనే విషయం అర్థమవుతుంది. కొత్త ఇంజిన్, మెరుగైన ఛాసిస్, అధునాతన ఎలక్ట్రానిక్స్ కలిసి దీన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.
Details
743cc ట్విన్ ఇంజిన్.. పవర్‌లో భారీ పెరుగుదల
హిమాలయన్ 750లో 743cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది.
ఇది 7,000rpm వద్ద 55bhp, 5,000rpm వద్ద 63Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
650 ఇంజిన్‌తో పోలిస్తే పీక్ పవర్ 17 శాతం, టార్క్ 21 శాతం పెరిగింది. 90 శాతం టార్క్ 3,500rpm నుంచే అందుబాటులో ఉండటం టూరింగ్ రైడర్లకు ఉపయోగపడే అంశం.
హైవేపై సుమారు 114kmph వేగంతో 4,500rpm వద్ద సులభంగా క్రూజ్ చేయగలదు.
Details
224 కిలోల బరువు.. కదిలితే మాత్రం కథ మారుతుంది
హిమాలయన్ 750 కర్బ్ వెయిట్ సుమారు 224 కిలోలు. పార్కింగ్‌లో వెనక్కి జరపడం లేదా నిలిపి ఉన్న బైక్‌ను కదిలించడం కొంత కష్టంగా అనిపించొచ్చు.
కానీ బైక్ కదలడం మొదలైన తర్వాత ఆ బరువు పెద్దగా ఇబ్బంది పెట్టదు.
సిసిలీ మలుపుల్లో బైక్ స్థిరంగా, నమ్మకంగా స్పందించింది. 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక చక్రాలతో రోడ్డు మీద మంచి బ్యాలెన్స్ కనిపించింది.
Details
టెక్నాలజీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త దశ
ఈ బైక్‌లో ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రోడ్, రోడ్ స్పోర్ట్, రైన్, ట్రెయిల్, కస్టమ్ మోడ్‌లు రైడింగ్ పరిస్థితికి అనుగుణంగా ఇంజిన్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌ను మార్చుతాయి.
కార్నరింగ్ ఏబీఎస్, లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.
4 అంగుళాల TFT డిస్‌ప్లేలో వై-ఫై, బ్లూటూత్, నావిగేషన్, ఫోన్, మ్యూజిక్ కంట్రోల్స్ లభిస్తాయి.
Details
లాంగ్ రైడ్లకు మరింత సౌకర్యం
హిమాలయన్ 750 సీటు ఎత్తు 815mm. అధికారిక యాక్సెసరీస్‌తో దీన్ని 795mm లేదా 835mmకి మార్చుకోవచ్చు.
17.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 205mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,522mm వీల్‌బేస్ ఉన్నాయి.
194kg పేలోడ్ సామర్థ్యం ఉండటంతో పిలియన్, లగేజీతో సుదీర్ఘ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. సింప్లిసిటీతో మొదలైన హిమాలయన్ ప్రయాణాన్ని 750 మరింత పవర్, టెక్నాలజీ, టూరింగ్ సామర్థ్యంతో కొత్త దశలోకి తీసుకెళ్లింది.