Royal Enfield Himalayan 750: రూ. 4.89 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750
ఈ వార్తాకథనం ఏంటి
అడ్వెంచర్ బైక్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. కంపెనీ అత్యంత శక్తివంతమైన మోడల్‌గా చెబుతున్న హిమాలయన్ 750ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2026 వేదికగా ఈ బైక్ పరిచయమైంది. 750cc అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4,89,490గా ఉంది. మూడు వేరియంట్లలో లభించే హిమాలయన్ 750కు డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Details
మూడు వేరియంట్లు.. మూడు ధరలు
హిమాలయన్ 750 బేస్ వేరియంట్ అజ్టెక్ గ్రీన్, టెక్టానిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
దీని ధర రూ.4,89,490. ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్‌తో వచ్చే మిడ్ వేరియంట్ వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
దీని ధర రూ.5,14,495. ఇక జీవీఐ టూరింగ్ ప్యాకేజీతో వచ్చే టాప్ వేరియంట్ అంటార్కిటిక్ సిల్వర్ ధర రూ.6,29,000గా ఉంది. అంటే అవసరాలకు తగ్గట్టు కస్టమర్లకు మూడు ఎంపికలు లభించనున్నాయి.
Details
743cc ఇంజిన్‌తో భారీ పవర్
ఈ బైక్‌లో కొత్త 743cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు.
ఇది 7,000 ఆర్‌పీఎం వద్ద 55 పీహెచ్‌పీ పవర్, 5,000 ఆర్‌పీఎం వద్ద 63 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించే రైడర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్‌లో షోవా అడ్జస్టబుల్ సస్పెన్షన్, 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక చక్రాలు ఉన్నాయి.
Details
ఫీచర్లలోనూ ఏమాత్రం తగ్గలేదు
హిమాలయన్ 750లో 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 815 ఎంఎం సీటు ఎత్తు ఉన్నాయి.
ఐదు రైడింగ్ మోడ్‌లు, కార్నరింగ్ ఏబీఎస్, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
నావిగేషన్‌తో కూడిన 4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే కూడా అందించారు.
దీంతో హైవే ప్రయాణాల నుంచి అడ్వెంచర్ రైడింగ్ వరకు బైక్‌ను మరింత సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
మార్కెట్లో హోండా ఎక్స్‌ఎల్750 ట్రాన్స్‌ఆల్ప్, కవాసకి వెర్సిస్ 650లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.