LOADING...
Royal Enfield:125 ఏళ్ల వారసత్వం.. ఫ్యాషన్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్
125 ఏళ్ల వారసత్వం.. ఫ్యాషన్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్

Royal Enfield:125 ఏళ్ల వారసత్వం.. ఫ్యాషన్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ కొత్తగా 'హెరిటేజ్ కలెక్షన్'ను విడుదల చేసింది. ఈకలెక్షన్‌లో లైఫ్‌స్టైల్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాతకాలపు డిజైన్‌లను ఆధునిక మెటీరియల్స్‌తో కలిపి తయారు చేసిన ఈ రేంజ్,రైడర్లతో పాటు స్టైలిష్‌గా ఉండాలనుకునే నగర యువతను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కాటన్ ట్విల్స్,కాన్వాస్ బ్లెండ్స్ వంటి బలమైన ఫాబ్రిక్స్‌తో తయారు చేసిన ఈ దుస్తులు రోజువారీ వినియోగానికి సౌకర్యవంతంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఈ కలెక్షన్ ప్రత్యేకత ఏంటంటే బ్రాండ్‌కు చెందిన పాతలోగోలు,గుర్తులను సింపుల్‌గా,సబ్టిల్‌గా డిజైన్‌లో ఉపయోగించడం. 1910క్యానన్ లోగో,1893 'Made Like a Gun'స్లోగన్,1969 ఇంటర్‌సెప్టర్ బ్యాడ్జ్ వంటి చారిత్రాత్మక అంశాలను నేటి స్టైల్‌కు తగ్గట్టు మళ్లీ తీసుకొచ్చారు.

వివరాలు 

ప్రతి డిజైన్‌లోనూ కంపెనీ వారసత్వం కనిపించేలా ప్రత్యేకంగా శ్రద్ధ

రంగుల విషయంలో కూడా మట్టి రంగులు, సాఫ్ట్ షేడ్స్‌ను ఉపయోగించి క్లాసిక్ లుక్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ఈ కలెక్షన్ ద్వారా బ్రాండ్ చరిత్రను కొత్త తరం ముందు తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతి డిజైన్‌లోనూ కంపెనీ వారసత్వం కనిపించేలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. గతాన్ని గుర్తుచేసేలా మాత్రమే కాకుండా, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కూడా ఈ దుస్తులు ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తానికి, ఈ హెరిటేజ్ కలెక్షన్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు తమకు నచ్చిన స్టైల్‌లో బ్రాండ్ చరిత్రను అనుభవించే అవకాశం కల్పించింది. రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉండటంతో పాటు, క్లాసిక్ లుక్‌ను కూడా ఈ కలెక్షన్ అందిస్తోంది.

Advertisement