Loading...
Royal Enfield Motoverse 2026: గోవాలో బైక్‌ లవర్స్‌ కోసం భారీ ఫెస్టివల్‌.. Motoverse 2026 డేట్స్‌ ఇవే
గోవాలో బైక్‌ లవర్స్‌ కోసం భారీ ఫెస్టివల్‌.. Motoverse 2026 డేట్స్‌ ఇవే

Royal Enfield Motoverse 2026: గోవాలో బైక్‌ లవర్స్‌ కోసం భారీ ఫెస్టివల్‌.. Motoverse 2026 డేట్స్‌ ఇవే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైక్‌లంటే ఇష్టపడే వారికి గోవాలో మరోసారి మోటార్‌సైకిల్‌ సందడి మొదలుకానుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నిర్వహించే Motoverse 2026 ఈ ఏడాది నవంబర్‌ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా కంపెనీ మ్యూజిక్‌ షోలు, బైక్‌ రైడింగ్‌ ఈవెంట్లు, రేసింగ్‌ పోటీలు, స్టంట్‌ షోలు, అడ్వెంచర్‌ యాక్టివిటీలను సిద్ధం చేసింది. 2026 ఎడిషన్‌కు ప్రత్యేకతగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 125 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా ఈ వేడుకలో సెలబ్రేట్‌ చేయనుంది.

Details

లాస్ట్‌ ఫ్రీక్వెన్సీస్‌ స్పెషల్‌ అట్రాక్షన్

ఈసారి Motoverseలో మ్యూజిక్‌ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బెల్జియన్‌ DJ, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ Lost Frequencies నవంబర్‌ 28న MotoSonic Main Stageపై లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నారు.

'Are You With Me', 'Reality', 'Where Are You Now' వంటి పాటలతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఇండియన్‌ ఆర్టిస్టులతో కలిపి మూడు రోజుల పాటు Main Stage, Community Stageలపై వరుసగా మ్యూజిక్‌ షోలు జరగనున్నాయి.

Details

బైక్‌ రైడింగ్‌ నుంచి రేసింగ్‌ వరకు

Motoverseలో మ్యూజిక్‌తో పాటు మోటార్‌సైక్లింగ్‌ అభిమానులను ఆకట్టుకునే యాక్టివిటీలకు పెద్దపీట వేశారు.

Slide School Cup India పేరుతో ఫ్లాట్‌ ట్రాక్‌ రేసింగ్‌, Himalayan Spirit పేరుతో అడ్వెంచర్‌ రైడింగ్‌ ఛాలెంజ్‌ నిర్వహించనున్నారు.

వీటితో పాటు Slide School, Drift School, GRRR Stunt Show వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.

Malle London MotoPolo Championship మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. MotoShamblesలో ట్రయల్స్‌ కోర్స్‌, Assembly Wars, Silent Sprint, Maze Chase వంటి పోటీలు కూడా ఉంటాయి.

ADVERTISEMENT

Details

గోవా రోడ్లపై ప్రత్యేక రైడింగ్‌ అనుభవాలు

ఈ ఫెస్టివల్‌ కేవలం ఒక వేదికకే పరిమితం కాకుండా గోవా రోడ్లపైకి కూడా విస్తరించనుంది.

Bike Shed x Royal Enfield Motoverse Tour, Malle Mile Ride, Major Arjun Galothతో Ride and Recon, Ride and Surf, Ride and Yoga వంటి రైడింగ్‌ అనుభవాలు అందుబాటులో ఉంటాయి.

Mayem Lake, Fontainhas ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైడ్లు ప్లాన్‌ చేశారు. మోటార్‌సైకిల్‌పై గోవాను కొత్తగా అనుభవించాలనుకునే వారికి ఇవి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

ADVERTISEMENT

Details

మోటార్‌సైకిల్‌ కల్చర్‌పై చర్చలు

MotoReel వేదికపై మోటార్‌సైకిల్‌ కల్చర్‌, రైడింగ్‌ అనుభవాలు, బైక్‌ల చరిత్రపై చర్చలు జరగనున్నాయి.

మోటార్‌సైకిల్‌ హిస్టోరియన్స్‌ Adil, Gordon Mayతో పాటు మాజీ డాకర్‌ రైడర్‌ CS Santosh పాల్గొననున్నారు.

Bike Shed, Deus Ex Machina, Malle London వంటి అంతర్జాతీయ మోటార్‌సైకిల్‌ కల్చర్‌ బ్రాండ్ల ప్రతినిధులు కూడా తమ అనుభవాలను పంచుకోనున్నారు.

Details

మరెన్నో యాక్టివిటీలతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్

వర్క్‌షాప్‌లు, Drum Circles, Capoeira, Kalaripayattu, MMA Self-Defence సెషన్లు కూడా ఈ మూడు రోజుల్లో నిర్వహించనున్నారు.

Cleanest Bike Competition, Moto Panja, Grip Grid వంటి పోటీల్లో సందర్శకులు పాల్గొనవచ్చు.

పెంపుడు జంతువుల కోసం MotoPaw పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. మొత్తంగా చూస్తే బైక్‌, మ్యూజిక్‌, అడ్వెంచర్‌, కల్చర్‌ అన్నింటినీ ఒకే చోట కలిపేలా Motoverse 2026ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సిద్ధం చేసింది.

ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ADVERTISEMENT