Skoda Peaq : 640 కి.మీ రేంజ్.. స్కోడా పీక్‌పై బిగ్ అప్డేట్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో స్కోడా మరో కీలక అడుగు వేసింది. చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంట్‌లో సంస్థ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. స్కోడా ప్రధాన తయారీ కేంద్రంగా ఉన్న ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోడళ్ల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎన్యాక్, ఎల్‌రాక్ వంటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న సంస్థ.. తాజాగా పీక్‌ను కూడా ఇదే ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు.. పీక్ కోసం అవసరమైన అధునాతన బ్యాటరీ సిస్టమ్‌లను కూడా ఇక్కడే తయారు చేస్తుండటం విశేషం.
వివరాలు
స్కోడా పీక్ ఈవీ.. ఉత్పత్తిలో సరికొత్త అడుగు..
మ్లాడా బోలేస్లావ్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న నాలుగో మోడల్‌గా స్కోడా పీక్ నిలిచింది.
గతంలో పెట్రోల్, డీజిల్ కార్ల తయారీకి ప్రధానంగా ఉపయోగించిన ఈ ప్లాంట్‌ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అనుగుణంగా భారీగా ఆధునీకరించారు.
2020లో ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని ఈ ప్లాంట్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత 2025 జనవరిలో ఎల్‌రాక్ ఉత్పత్తి మొదలైంది.
తాజాగా పీక్ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ మూడు ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు ఆక్టేవియా కాంబి కార్లను కూడా ఇక్కడే అసెంబుల్ చేస్తున్నారు.
దీంతో చెక్ రిపబ్లిక్‌లోని స్కోడా ప్లాంట్లలో తయారవుతున్న మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా ఏకంగా 23 శాతానికి చేరుకుంది.
వివరాలు
స్కోడా పీక్ ఈవీ.. భారీ బ్యాటరీ, 640 కి.మీకి పైగా రేంజ్!
మరోవైపు మార్కెట్లో స్కోడా పీక్‌కు మంచి స్పందన లభిస్తోంది. జులై చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం కస్టమర్ల నుంచి దాదాపు 8,500 ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్‌లో 91 కిలోవాట్ అవర్ గ్రాస్ బ్యాటరీని అందించారు.
ఇందులో 86 కిలోవాట్ అవర్ వినియోగానికి అందుబాటులో ఉంటుంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 640 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్ల కోసం 63 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.