LOADING...
Car Parking Tips: పార్కింగ్‌లో చిన్న నిర్లక్ష్యం.. కారుకు పెద్ద నష్టం..మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!
మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

Car Parking Tips: పార్కింగ్‌లో చిన్న నిర్లక్ష్యం.. కారుకు పెద్ద నష్టం..మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కారు నడపడం కంటే సరిగా పార్క్ చేయడం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పార్కింగ్ సమయంలో చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల కారుపై స్క్రాచెస్ పడటం లేదా డెంట్లు రావడం జరుగుతుంది. దీంతో కారు అందం తగ్గిపోవడమే కాకుండా, లోహ భాగాలు దెబ్బతిని తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పార్కింగ్ సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

#1

సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ముఖ్యం

కారు నిలపడానికి ముందుగా తగినంత ఖాళీ ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. పార్కింగ్ ప్రాంతంలో గీతలు ఉంటే,వాటి మధ్యలో కారు సరిగ్గా నిలపాలి. తొందరలో వంకరగా నిలిపితే పక్కన ఉన్న వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాకుండా,ఇతర వాహనాలు ఢీకొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. 2. పక్కన ఉన్న వాహనాలపై నిఘా కారు పార్క్ చేసే సమయంలో చుట్టూ ఉన్న వాహనాలను గమనించడం చాలా అవసరం.పెద్ద వాహనాల పక్కన నిలిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి,ఎందుకంటే వాటికి తిరగడానికి ఎక్కువ స్థలం అవసరం ఉంటుంది. అలాగే ఇప్పటికే ఎక్కువ డెంట్లు లేదా స్క్రాచెస్ ఉన్న కార్ల పక్కన పార్క్ చేయకపోవడమే మంచిది. అటువంటి వాహనదారులు తలుపులు నిర్లక్ష్యంగా తెరవడం వల్ల మీ కారుకు నష్టం కలగవచ్చు.

వివరాలు 

3. సైడ్ మిర్రర్లను ఫోల్డ్ చేయండి

ఇరుకైన ప్రదేశాల్లో కారు నిలిపినప్పుడు పక్క అద్దాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కారు నిలిపిన వెంటనే వాటిని లోపలికి మడవడం అలవాటు చేసుకోవాలి. దీంతో పక్కగా వెళ్లే వాహనాలు లేదా నడిచే వారు వాటిని తాకకుండా ఉంటారు. ఆటోమేటిక్‌గా మడిచే సౌకర్యం ఉంటే ఇది ఇంకా సులభంగా ఉంటుంది. 4. టెక్నాలజీని ఉపయోగించండి.. ఓపికగా ఉండండి పార్కింగ్ సమయంలో తొందరపడకుండా నెమ్మదిగా కారు కదలించాలి. మీ కారులో ఉన్న రివర్స్ కెమెరా, సెన్సార్లు, మిర్రర్లను సరిగ్గా ఉపయోగించుకోండి. ఇవి మీ కారు చుట్టూ ఉన్న వస్తువులకు ఎంత దూరం ఉందో స్పష్టంగా తెలియజేస్తాయి. ఓపికతో వ్యవహరిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.

Advertisement