NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ
    తదుపరి వార్తా కథనం
    Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ
    బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ

    Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బజాజ్ చేతక్ EV నుంచి పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ సంఘటన గురువారం జల్నా రోడ్డులో రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుంది.

    సిగ్నల్ వద్ద నిల్చున్న స్కూటర్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. తర్వాత, నీళ్లు చల్లడంతో పొగలు ఆగిపోయాయి.

    ఈ వీడియో వైరల్ కావడంతో బజాజ్ ఆటో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది.

    అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపు చేశారు. బజాజ్ ఆటో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసింది.

    వివరాలు 

    అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లడంతో పొగలు ఆగిపోయాయి

    వరవండి గ్రామానికి చెందిన భగవాన్ చవాన్, రవీంద్ర చవాన్ అనే రైతులు నీటి పైపుల కొనుగోలుకు ఛత్రపతి శంభాజీనగర్‌కు వచ్చారు.

    సిగ్నల్ వద్ద వేచి ఉండగా, వారి ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించారు.

    దీంతో, స్కూటర్‌ను పక్కకు తీసుకెళ్లి సెవెన్‌హిల్స్ ఫైర్‌ స్టేషన్ నుంచి ఫైర్‌ బ్రిగేడ్‌ బృందాన్ని పిలిపించారు.

    అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లడంతో పొగలు ఆగిపోయాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని బజాజ్ ఆటో ప్రతినిధి చెప్పారు.

    అయితే, స్థానిక పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గురించి సమాచారం లేదని తెలిపారు.

    వివరాలు 

    బజాజ్ చేతక్ ఫీచర్లు, ధర

    ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుతూ, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అని అన్నారు. 'ఓలా అంటే వడగళ్ళు, చేతక్ అంటే షోలా' అని ఆయన వ్యాఖ్యానించారు.

    బజాజ్ చేతక్‌లో వివిధ బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

    ఇది 63 కిలోమీటర్ల నుండి 137 కిలోమీటర్ల వరకు పరిధి కలిగి ఉంటుంది.

    బేస్ మోడల్ గరిష్ట వేగం గంటకు 63 కిమీ, టాప్ మోడల్ గంటకు 73 కిమీ వేగంతో లభిస్తుంది.

    ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,998 నుండి రూ.1,28,744 వరకు ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ స్కూటర్

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    ఎలక్ట్రిక్ స్కూటర్

    Zelio X Men 2.0: 6.75 రూపాయలకే 100కిలోమీటర్లు పరుగెత్తగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్! ధర ఎంతంటే..? ఆటోమొబైల్స్
    Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే! ఆటో మొబైల్
    Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025