Maserati Ghibli 334 కారు ప్రత్యేక స్పెషల్ ఫీఛర్లు ఇవే
ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మసేరాటి' కంపెనీ నుంచి గిబ్లి 334 పేరుతో కొత్త మోడల్ విడుదలైంది. గ్రీన్ ఎనర్జీకి అనుకూలంగా తయారు చేసిన ఈ కారు, ప్రపంచవ్యాప్తంగా కేవలం 103యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 334 అనేది కారు స్పీడును వేగాన్ని సూచిస్తుంది. 334km/h వేగంతో ఈకారు దూసుకెళ్తుంది. బ్లూ కలర్‌లో ఉండే కారు పక్క భాగంలో రెడ్ కలర్‌లో 334 అనే అంకెలతో బ్యాడ్జ్ ఉంటుంది. అలాగే, ట్రైడెంట్ లోగోతో కూడిన క్రోమ్ స్లాటెడ్ గ్రిల్, ఎల్ఈడీ ల్యాంప్స్, వాలుగా ఉండే రూఫ్ లైన్, ఓరియాన్ బ్లాక్ అవుట్ వీల్స్ ఉన్నాయి. కారు ధృఢత్వాన్ని పెంచేందుకు, బరువును తగ్గించేందుకు కార్బన్ కిట్‌తో వాహనం భాగాలను తయారు చేసారు.
బకెట్ సీట్లు కలిగిన కారు
బంపర్ ప్లేట్స్, డోర్ హ్యాండిల్స్, మిర్రర్ క్యాప్స్, ఎయిర్ స్ప్లిట్టర్, డిఫ్యూజర్ అనేవి కార్బన్ కిట్ తో తయారుచేయబడ్డాయి. గిబ్లి 334 ఇంటీరియర్ విషయానికి వస్తే, టెర్రాకొట్టా, అల్కాంతరా లెదర్ తో తయారు చేసిన నాలుగు సీట్లు ఉంటాయి. ఈ నాలుగు సీట్లు కూడా బకెట్ సీట్స్ రకానికి చెందినవి. మల్టీ ఫంక్షనింగ్ స్టీరింగ్ వీల్, 7అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ ఉంటుంది. 3.8లీటర్ల టర్బో ఛార్జ్, వీ8 ఇంజన్, 8-స్పీడ్ గేర్ బాక్స్, 572hp పవర్ తో 730Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.