Loading...
Spyker: V8 సూపర్‌కార్‌లకు స్పైకర్ వీడ్కోలు.. C8 Preliator XXV ఆవిష్కరణ
V8 సూపర్‌కార్‌లకు స్పైకర్ వీడ్కోలు.. C8 Preliator XXV ఆవిష్కరణ

Spyker: V8 సూపర్‌కార్‌లకు స్పైకర్ వీడ్కోలు.. C8 Preliator XXV ఆవిష్కరణ

వ్రాసిన వారు Moogati Shabari
Aug 16, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

విలాసవంతమైన డిజైన్‌తో కూడిన మిడ్-ఇంజిన్ సూపర్‌ కార్ తయారీకి పేరుగాంచిన డచ్ ఆటో మొబైల్ సంస్థ స్పైకర్.. తన V8 సూపర్‌కార్ ప్రయాణానికి ముగింపు పలికింది. C8 Preliator XXV Coupeను సంస్థ ఆవిష్కరించింది. మాంటెరీ కార్ వీక్‌లో భాగంగా జరిగిన ది క్వెయిల్ కార్యక్రమంలో ఈ కొత్త మోడల్‌ను ప్రదర్శించారు. స్పైకర్ రూపొందించిన V8 సూపర్‌కార్ శ్రేణిలో ఇదే చివరి మోడల్‌గా నిలవనుంది. ఆకర్షణీయమైన బాడీ డిజైన్, సున్నితమైన మెటల్ ట్రిమ్, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. లోపల క్విల్టెడ్ లెదర్ అప్హోల్స్టరీని ఉపయోగించారు.

వివరాలు

డిజైన్ ఎలా ఉంది?

C8 Preliator XXV.. స్పైకర్ ఆధునిక ఉత్పత్తి కార్లలో మూడో తరం మోడల్.

ఈ సిరీస్‌లో తొలి C8 Preliatorను 2016లో సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

కొత్త కారును స్పైకర్ "పూర్తిగా కొత్త ఆటోమొబైల్"గా అభివర్ణిస్తున్నప్పటికీ.. దాని డిజైన్ మాత్రం మునుపటి మోడల్‌కు చాలా దగ్గరగా ఉంటుంది.

కారు బాడీని పూర్తిగా చేతితో తయారు చేసిన అల్యూమినియంతో రూపొందించారు.

వంపులతో కూడిన ఆకర్షణీయమైన బాడీ లైన్లకు మెరిసే రోజ్-గోల్డ్ రంగు యాక్సెంట్లను జోడించారు.

విమానయాన రంగం నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్ అంశాలు ఇందులో కనిపిస్తాయి.

ముఖ్యంగా వెనుక భాగంలోని టెయిల్‌లైట్లు ఫైటర్ జెట్‌లలో కనిపించే ఆఫ్టర్‌బర్నర్లను పోలి ఉండేలా రూపొందించారు.

వివరాలు

ఇంజిన్.. పనితీరు

C8 Preliator XXVలో ఆడి నుంచి తీసుకున్న ట్విన్-టర్బోచార్జ్డ్ 4.0-లీటర్ V8 ఇంజిన్ను అమర్చారు. ఈ ఇంజిన్ ఏకంగా 789 హెచ్‌పీ పవర్, 999 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ శక్తిని వెనుక చక్రాలకు అందించేందుకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ను ఉపయోగించారు.

స్పైకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సూపర్‌కార్ కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ఠ వేగం గంటకు 349 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

విలాసవంతమైన ఇంటీరియర్..

C8 Preliator XXV బాహ్య డిజైన్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో దీని క్యాబిన్‌ను కూడా అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు.

ఇంటీరియర్‌లో అల్యూమినియంతో రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను అందించారు.

ఇందులో అనేక అనలాగ్ గేజ్‌లు, బటన్లు, స్విచ్‌లు ఉన్నాయి. బయట కనిపించే రోజ్-గోల్డ్ డిజైన్ ఎలిమెంట్లను క్యాబిన్‌లోనూ కొనసాగించారు.

ఇంటీరియర్‌లో 'Tuscan Saddle'గా పిలిచే రిచ్ క్విల్టెడ్ బ్రౌన్ లెదర్‌ను విస్తృతంగా ఉపయోగించారు.

దీంతో కారుకు మరింత ప్రీమియం, ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఈ మోడల్ తయారీలో హ్యాండ్‌క్రాఫ్ట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

కారు బయట భాగంలోని ప్రతి ప్యానెల్‌ను చేతితోనే ఆకృతిలోకి తీసుకువస్తారు.

ఒక్క C8 Preliator XXV కారును పూర్తిగా తయారు చేయడానికి సుమారు 800 గంటల సమయం పడుతుంది.

ADVERTISEMENT