
త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.
తాజాగా మారుతీ సుజకీ త్వరలో జపాన్ జరిగే మొబిలిటీ షో 2023లో కొన్ని కార్లను ప్రారంభించడానికి సన్నహాలను చేస్తోంది.
మారుతీ సుజుకీ eWX, EVX, eWX వాహనాలను ప్రవేశపెట్టనుంది. మరోవైపు EVXను వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఆ సంస్థ ప్లాన్ చేస్తుంది.
క్రెటా EV, సెల్టోస్ EV, Tata Curvv వంటి వాహనాలకు మారుతి సుజుకి EVX గట్టి పోటీ ఇవ్వనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Details
మారుతీ సుజుకీ EVX లో అధునాతన ఫీచర్లు
eWX ఎలక్ట్రిక్ మినీ వ్యాగన్‌ను రాబోయే జపాన్ మొబిలిటీ షో 2023లో ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ అక్టోబర్ 26, నవంబర్ 05, 2023 మధ్య జరిగే అవకాశం ఉంటుంది.
Suzuki eWX ని పూర్తి ఛార్జ్ చేస్తే 230 కి.మీ ప్రయాణించగలదని సంస్థ స్పష్టం చేసింది. లాంచ్ సమయంలో దీని గురించి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
మారుతి ఆటో ఎక్స్‌పో 2023లో మొదటిసారిగా EVX కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.
మారుతీ సుజుకీ EVXలో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డిస్‌ప్లే, వర్టికల్ AC వెంట్స్, సెంటర్ కన్సోల్‌లో రోటరీ కంట్రోలర్, 2-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉండొచ్చు.
మారుతి సుజుకి EVXను ఇండియాలో 2025లో విడుదల చేయనున్నారు.