Loading...
Suzuki Gixxer: సుజుకీ జిక్సర్‌ బైక్‌లకు కొత్త లుక్‌.. ప్రారంభ ధర రూ.1.37 లక్షల నుంచే
సుజుకీ జిక్సర్‌ బైక్‌లకు కొత్త లుక్‌.. ప్రారంభ ధర రూ.1.37 లక్షల నుంచే

Suzuki Gixxer: సుజుకీ జిక్సర్‌ బైక్‌లకు కొత్త లుక్‌.. ప్రారంభ ధర రూ.1.37 లక్షల నుంచే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైక్‌ ప్రియులను ఆకట్టుకునేలా సుజుకీ తన జిక్సర్‌ మోడల్‌ శ్రేణిని కొత్త రంగులతో అప్‌డేట్‌ చేసింది. జిక్సర్‌, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌, జిక్సర్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీ బైక్‌లకు కొత్త కలర్‌ ఆప్షన్లను పరిచయం చేసింది. అయితే ఈ మార్పులు కేవలం బైక్‌ల రూపానికే పరిమితం. ఇంజిన్‌, చాసిస్‌, ఫీచర్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. 155cc మోడళ్లకు డ్యూయల్‌ టోన్‌ కలర్‌ సుజుకీ జిక్సర్‌, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 155cc మోడళ్లలో కొత్తగా 'మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే - పెర్ల్‌ బ్లేజ్‌ ఆరెంజ్‌' డ్యూయల్‌ టోన్‌ రంగును జోడించింది. జిక్సర్‌ ప్రారంభ ధర రూ.1,37,221 కాగా.. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర రూ.1,40,729 నుంచి మొదలవుతుంది.

వివరాలు 

జిక్సర్‌ 250కి కొత్త కలర్

ఈ రెండు మోడళ్లలోనూ 155cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌నే కొనసాగించారు.

250cc విభాగంలో జిక్సర్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 మోడళ్లకు 'గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ - మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే' అనే కొత్త కలర్‌ కాంబినేషన్‌ అందించారు.

జిక్సర్‌ 250 ధర రూ.1,84,517 నుంచి ప్రారంభమవుతుంది. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ప్రారంభ ధర రూ.1,92,768గా ఉంది.

ఈ రెండు బైక్‌ల్లో 249cc ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 26.5 పీఎస్‌ పవర్‌, 22.2 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్‌ కోసం 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. భద్రత కోసం డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ సహా ఇప్పటికే ఉన్న ఫీచర్లనే కొనసాగించారు.

వివరాలు 

ఎఫ్‌ఎఫ్‌వీ మోడల్‌లో రెండు కొత్త రంగులు

జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీ మోడల్‌కు కూడా సుజుకీ రెండు కొత్త రంగులను తీసుకొచ్చింది.

'గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ - మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే'తో పాటు పూర్తిగా 'గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌' రంగులోనూ ఈ బైక్‌ లభించనుంది.

దీని ధర రూ.1,98,476గా నిర్ణయించారు. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 ఎఫ్‌ఎఫ్‌వీ ప్రత్యేకత ఏంటంటే.. ఈ బైక్‌ ఈ85 వరకు ఇథనాల్‌ కలిసిన ఇంధనాన్ని ఉపయోగించగలదు.

ఇందులోని ఇంజిన్‌ 27.9 పీఎస్‌ పవర్‌, 22.5 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

లుక్‌ మాత్రమే మారింది..

కొత్త రంగుల కారణంగా సుజుకీ జిక్సర్‌ రేంజ్‌ మరింత కొత్తగా కనిపించనుంది.

అయితే బైక్‌ల పనితీరు, ఇంజిన్‌, చాసిస్‌, ఇతర మెకానికల్‌ అంశాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

కొత్త కలర్‌ ఆప్షన్లతో అప్‌డేట్‌ చేసిన ఈ జిక్సర్‌ మోడళ్లను దేశవ్యాప్తంగా ఉన్న సుజుకీ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ADVERTISEMENT