Loading...
Tata Motors: సెప్టెంబర్‌ నుంచి టాటా కార్లు మరింత ప్రియం.. రూ.25 వేల వరకు పెంపు
సెప్టెంబర్‌ నుంచి టాటా కార్లు మరింత ప్రియం.. రూ.25 వేల వరకు పెంపు

Tata Motors: సెప్టెంబర్‌ నుంచి టాటా కార్లు మరింత ప్రియం.. రూ.25 వేల వరకు పెంపు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ కార్ల ధరలను పెంచనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి తమ కార్ల ధరలను గరిష్ఠంగా రూ.25,000 వరకు పెంచనున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వివరాలు

వాటిపై కూడా పెరిగిన ధరలు..

ఈ ధరల పెంపు ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ (ICE) కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా వర్తించనుంది.

అయితే, ఎంత మేర ధర పెంచాలనేది ఆయా మోడళ్లను బట్టి మారుతుందని కంపెనీ వెల్లడించింది.

ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల పెరిగిన వ్యయాన్ని ఇప్పటివరకు కంపెనీ చాలా వరకు భరిస్తూ వచ్చిందని టాటా మోటార్స్‌ తెలిపింది.

అయితే, పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మాత్రమే ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT