Loading...
Varalakshmi Vratham : నేడు వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
నేడు వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Varalakshmi Vratham : నేడు వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రావణ మాసం అంటే వ్రతాలు, నోములకు ప్రత్యేకమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో మంగళవారం మంగళగౌరి దేవిని, శుక్రవారం మహాలక్ష్మిని శ్రీవరలక్ష్మిగా, శనివారం వేంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు పూజిస్తారు. అయితే సౌభాగ్యం, సంపద, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో శ్రీవరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 21) తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.

వివరాలు

తొలి పూజా సమయం ఇదే..

వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఏడాదంతా ఉంటుందని పౌరాణిక గ్రంథాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా అన్నంతో తయారు చేసిన ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలని సూచిస్తున్నారు.

దద్దోజనం, పాయసాన్నం, పులిహోర, పులగం, గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నం వంటి వాటిని నైవేద్యంగా పెట్టవచ్చని చెబుతున్నారు.

మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని, తమ కుటుంబంలో సౌభాగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.

నేడు ఉదయం 6:15 గంటల నుంచి 8:20 గంటల వరకు సింహ లగ్నం ఉంది. కలశ స్థాపన, తొలి పూజకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

వివరాలు

అమ్మవారికి ఏం సమర్పించాలి..

ఉదయం పూజ చేసుకోలేనివారు మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 3 గంటల వరకు ఉన్న వృశ్చిక లగ్నంలో పూజ చేసుకోవచ్చు.

సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 8:20 గంటల వరకు కుంభ లగ్నం ఉంటుంది.

ప్రదోష కాలంలో దీపారాధన, అర్చన చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.

అయితే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు యమగండం ఉండటంతో ఈ సమయాల్లో కొత్తగా పూజ ప్రారంభించకూడదని పండితులు చెబుతున్నారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి చీర లేదా బ్లౌజ్‌పీస్‌ను సమర్పించడం ఆనవాయితీ.

ADVERTISEMENT

వివరాలు

పూజ తర్వాత ఏం చేయాలో తెలుసా?

పూజ పూర్తయిన తర్వాత చాలామంది మహిళలు అమ్మవారికి అలంకరించిన చీర, బ్లౌజ్‌పీస్‌ను తాము ఉపయోగించుకోవాలని భావిస్తుంటారు.

అలా చేయడం సరికాదని పండితులు చెబుతున్నారు. మరుసటి రోజు మహాలక్ష్మిని పూజించి, అమ్మవారి విగ్రహాన్ని కదిలించిన తర్వాత ఆ చీర, బ్లౌజ్‌పీస్‌ను ఏదైనా సుహాసినికి లేదా వ్రతం చేయించిన వారికి బహుమానంగా ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.

అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉండాలని కోరుకునేవారు ఈ వ్రతానికి ఉద్యాపన చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

వరలక్ష్మీ వ్రతం రోజున పూజలో పాల్గొనే వారు, ఇంట్లోని ఇతర సభ్యులు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు. బ్రహ్మచర్యాన్ని పాటించాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఈ పనులు అస్సలు చేయకండి..

అలాగే ఇంట్లోని చెత్తను బయటకు వేయడం, చీపురుతో ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదని సూచిస్తున్నారు.

ఇతరులతో గొడవ పడటం, కఠినంగా మాట్లాడటం, చిరాకుగా ఉండటం వంటివాటికి దూరంగా ఉండాలి.

ఈ రోజున ధనాన్ని అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా చేయకూడదని చెబుతున్నారు.

వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు తీయడం వంటివి చేయడం అపశకునంగా భావిస్తారు.

పూజ కోసం తులసి దళాలను తెంపకూడదని, జుట్టును విరబూసుకొని ఉండకూడదని సూచిస్తున్నారు.

ఇంట్లో దుర్గంధం లేకుండా సాంబ్రాణి లేదా అగరబత్తుల పొగతో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

గృహిణులు తప్పనిసరిగా చీర ధరించాలని, పెళ్లికాని ఆడపిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించాలని చెబుతున్నారు.

అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు వదిలిపెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT