Page Loader
Tata Motors: టాటా మోటార్స్ మరో మైలురాయి : లక్షఈవీ వాహనాల విక్రయం 
టాటా మోటార్స్ రికార్డ్: లక్షఈవీ వాహనాల తయారీ

Tata Motors: టాటా మోటార్స్ మరో మైలురాయి : లక్షఈవీ వాహనాల విక్రయం 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 12, 2023
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. తాజాగా టాటా మోటార్స్ లక్ష ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మైలురాయిని పూర్తి చేసుకుంది. గత 9నెలల్లో 50వేల యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. టాటా తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల్లో మూడు బాడీ మోడల్స్ ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్(టియాగో EV), సెడాన్ ( టైగోర్ EV), SUV(నెక్సాన్ EV) ఉన్నాయి. ఈ వాహనాల ధరలు 8.29లక్షల నుంచి 19.29లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో మొదటి 10వేల యూనిట్లను 44నెలల్లో అమ్మిన టాటా మోటార్స్, ఆ తర్వాత 44వేల అమ్మకాలను కేవలం 15నెలల్లో అమ్మింది.

Details

ఎనిమిది నెలల్లో 'టాటా పంచ్ ఈవీ' విడుదల

టాటా మోటార్స్ 50వేల వాహనాలను కేవలం 9నెలల్లోనే అమ్మింది. నెక్సాన్ EV మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్మకాల్లో బాగా వేగం పెరిగింది. ప్రస్తుతం టైగోర్ EV మోడల్‌కి మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఎక్కువగా టాటా మోటార్స్ వాహనాలే ఉన్నాయి. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం, 2025వరకు టాటా మోటార్స్ నుంచి 10కొత్త ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ రానున్నాయ. టాటా పంచ్ ఈవీ, Curvv coupe-SUV EV మోడల్స్ మరో 8నెలల్లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. 2019లో టైగోర్ EV ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంలోకి టాటా మోటార్స్ అడుగు పెట్టింది.